ఈ ఫొటోలోని స్టార్ హీరోని గుర్తు ప‌ట్టారా.. చిన్న‌ప్పుడు ఎంత క్యూట్‌గా ఉన్నాడు..!

  • By: sn    breaking    Jan 22, 2024 11:22 AM IST
ఈ ఫొటోలోని స్టార్ హీరోని గుర్తు ప‌ట్టారా.. చిన్న‌ప్పుడు ఎంత క్యూట్‌గా ఉన్నాడు..!

ఇటీవ‌లి కాలంలో సెల‌బ్రిటీల చిన్న‌ప్ప‌టి పిక్స్ సోష‌ల్ మీడియాలో తెగ ర‌చ్చ చేస్తున్నాయి. త‌మ అభిమాన హీరో, హీరోయిన్స్ చిన్న‌ప్పుడు భ‌లే క్యూట్‌గా ఉండ‌డం చూసి ఫ్యాన్స్ మైమ‌ర‌చిపోతున్నారు. తాజాగా నెట్టింట ఒక క్యూట్ పిక్ వైర‌ల్ అవుతుండ‌గా, ఇందులో స్టార్ హీరో చిన్న‌ప్ప‌టి లుక్ ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంటుంది. మ‌రి ఈ పిక్‌లో ఉన్న ఆ స్టార్ హీరోని మీరెవ‌రైన గుర్తు ప‌ట్టారా.. అత‌ను తాత‌కు త‌గ్గ మ‌న‌వ‌డిగా ప్ర‌త్యేక పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించ‌డ‌మే కాకుండా గ్లోబ‌ల్ స్టార్‌గా కూడా ఎదిగాడు. రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సినిమాతోనే డెబ్యూ ఇచ్చి రాజ‌మౌళి సినిమాతోనే పాన్ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు.

మ‌రి ఆ హీరో ఎవ‌రనేది ఇప్పటికే మీకు ఒక ఐడియా వ‌చ్చి ఉంటుంది. అత‌ను మ‌రెవ‌రో కాదు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్. జూ. ఎన్టీఆర్ హరికృష్ణ, శాలిని దంపతులకు 1983లో మే 20న జన్మించిన ఎన్టీఆర్.. గుడివాడలో ఉన్న మొంటిస్సోరి స్కూల్ లో ప్రాధమిక చదువు పూర్తి చేసి.. ఇంటర్ కోసం హైదరాబాద్ లోని సెయింట్ మేరీ జూ. కాలేజీలో చేరారు. ఆయ‌న చదువు మాత్రమే కాదు ఇటు నటన, కూచిపూడి నాట్యంలో కూడా శిక్షణ పొందారు. ఇక తాతగారు సీ. ఎన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా ద్వారా సినీ ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం అయ్యారు. ఇక అప్ప‌టి నుండి స‌త్తా చాటుతూ స్టార్ హీరోగా ఎదిగారు.

బాల రామాయణం సినిమాలో రాముడిగా నటించిన ఎన్టీఆర్ అంద‌రి ప్ర‌శంస‌లు అందుకున్నాడు. అప్పుడే ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఎదుగుతాడ‌ని చాలా మంది జోస్యాలు చెప్పారు. ఇక 2001లో నిన్ను చూడాలని సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అదే సంవత్సరంలో వచ్చిన స్టూడెంట్ నెం.1 సినిమా హిట్ సాధించ‌డంతో ఎన్టీఆర్‌కి తిరుగు లేకుండా పోయింది. 20 సంవత్సరాలకే స్టార్ గా ఎదిగి తన సత్తా చాటుకున్న ఎన్టీఆర్ త్వ‌ర‌లో దేవ‌ర అనే సినిమాతో స‌త్తా చాటేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ఈ మూవీ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతుంది.2024 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నందున, ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. అనిరుధ్ రవి చందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా హైదరాబాద్‌ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ షెడ్యూల్‌ను ప్రారంభించినట్లు సమాచారం