పబ్లిక్‌లో కాజల్ నడుముపై చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించిన అభిమాని.. ఆమె ఏం చేసిందంటే..!

హీరోయిన్స్ బయటకు వచ్చినప్పుడు వారికి విచిత్ర పరిస్థితులు ఎదురువుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. రీసెంట్‌గా కలువకళ్ల సుందరి కాజల్ అగర్వాల్‌కి ఎదురైన షాకింగ్ ఘటనతో బిత్తరపోయింది. కాజల్‌కి పెళ్లై ఓ బిడ్డకు జన్మనిచ్చిన కూడా ఈ అమ్మడు అదే అందం మెయింటైన్ చేస్తూ కుర్రాళ్లు మనసులు దోచుకుంటుంది. రీసెంట్‌గా హైదరాబాద్ లోని ఓ స్టోర్ ప్రారంభోత్సవం కోసం తన తండ్రి వినయ్ తో హాజరైంది కాజల్ అగర్వాల్.రెడ్ కలర్ శారీలో హాజరైన కాజల్‌ని చూసి ఆమె అభిమానులు మురిసిపోయారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. అయితే ఒకడు మాత్రం తన వక్రబుద్ధిని చూపించాడు.
కాజల్‌తో సెల్ఫీ దిగడానికి ఆమె దగ్గరకు వెళ్లి నడుము పట్టుకుని ఫొటో దిగడానికి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తం అయిన కాజల్ ఏం చేస్తున్నావ్ అంటూ అతనిపై అసహనం వ్యక్తం చేసింది కాని చెంపదెబ్బ కొట్టడం, యాక్షన్ తీసుకోవడం వంటివి చేయలేదు. ఆ వ్యక్తి చేసిన పనికి సోషల్ మీడియాలో అతన్ని తెగ తిట్టేస్తున్నారు. మరోవైపు కాజల్ ప్రశాంతంగా ఉన్న తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ ఘటన తర్వాత కాజల్ మీడియాతో మాట్లాడుతూ… అభిమానులు అంటే తనకు సొంత కుటుంబంతో సమానమని చెప్పుకురావడం విశేషం.
కెరీర్ పీక్స్‌లో ఉండగానే కాజల్ పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెలిసిందే. సినిమాల్లోకి ఎంటరైన తర్వాత వరుసగా సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ.. గౌతమ్ కిచ్లూ అనే వ్యాపారవేత్తతో రహస్యంగా కొన్నాళ్లపాటు ప్రేమ వ్యవహారం నడిపింది. అయితే కొన్నాళ్ల తర్వాత అది రివీల్ చేసిన కాజల్ అతనిని పెళ్లాడి గత ఏడాది ఓ మగ బిడ్డకు తల్లైంది. ఆ తర్వాత కొంత కాలం పాటు సినిమాలకు గ్యాప్ తీసుకుని ఇప్పుడు తిరిగి సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఆమె సత్యభామ, ఇండియన్2 సినిమాలతో బిజీగా ఉంది. గతంలో మాదిరిగా కాజల్‌కి మంచి సక్సెస్‌లు రావడం లేదు. అలానే అవకాశాలు కూడా అంత పెద్దగా వస్తున్నట్టు కనిపించడం లేదు. అందుకే షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌కి హాజరై సందడి చేస్తుంది.
Orey