సాకర్‌లో.. అర్జెంటీనా చేతిలో ఓటమి.. ఫ్రాన్స్‌లో అభిమానుల రచ్చ..

Riots Erupt in France | ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌లో అర్జెంటీనా చేతిలో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఫ్రాన్స్‌ ఓటమిపాలైన విషయం తెలిసింది. ఓటమిని ఫ్రాన్స్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మ్యాచ్‌ అనంతరం దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. పారిస్‌, నైస్‌, లియోన్‌తో పాటు పలు నగరాల్లో భారీగా జనం వీధుల్లోకి వచ్చి.. వాహనాలను అడ్డకుంటూ వీరంగం సృష్టించారు. శాంతిభద్రతలను అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు ప్రయత్నించినా చివరకు లాభం లేకపోయింది. పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వగా.. జనాన్ని చెదరగొట్టేందుకు పోలీసులు […]

సాకర్‌లో.. అర్జెంటీనా చేతిలో ఓటమి.. ఫ్రాన్స్‌లో అభిమానుల రచ్చ..

Riots Erupt in France | ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌లో అర్జెంటీనా చేతిలో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఫ్రాన్స్‌ ఓటమిపాలైన విషయం తెలిసింది. ఓటమిని ఫ్రాన్స్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మ్యాచ్‌ అనంతరం దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. పారిస్‌, నైస్‌, లియోన్‌తో పాటు పలు నగరాల్లో భారీగా జనం వీధుల్లోకి వచ్చి.. వాహనాలను అడ్డకుంటూ వీరంగం సృష్టించారు. శాంతిభద్రతలను అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు ప్రయత్నించినా చివరకు లాభం లేకపోయింది. పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వగా.. జనాన్ని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించారు. సాకర్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆదివారం జరిగిన విషయం తెలిసిందే. అర్జెంటీనా షూటౌట్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఫ్రాన్స్‌ను ఓడించి కప్‌ను ఎగరేసుకొని పోయింది.

కెప్టెన్‌ లియోనెల్‌ మెస్సీ (23వ, 108వ నిమిషాల్లో) కెరీర్‌ చివరి మ్యాచ్‌లో తనదైన ఆటతీరుతో రెండు గోల్స్‌ సాధించగా.. ఫ్రాన్స్‌ స్టార్‌ స్ట్రయికర్‌ కిలియన్‌ ఎంబాపే (80వ, 81వ, 118వ నిమిషాల్లో) హ్యాట్రిక్‌ గోల్స్‌తో చెలరేగాడు. నిర్ణీత సమయంలో ఇరు జట్లు చెరో రెండు గోల్స్‌కు పరిమితం కావడంతో విజేతను నిర్ణయించేందుకు ఎక్స్‌ట్రా టైమ్‌ కేటాయించారు. అర్జెంటీనా గోల్‌ సాధించడంతో ఇక మెస్సీ సేన గెలుపు ఖాయమే అనుకుంటున్న తరుణంలో ఎంబాపే అద్వితీయ రీతిలో గోల్‌ నమోదు చేయడంతో మరోసారి 3-3తో స్కోర్లు సమమయ్యాయి. దీంతో పెనాల్టీ షూటౌట్‌ అనివార్యమైంది. ఇందులో అర్జెంటీనా గోల్‌ సాధించి కప్‌ను ఎగురవేసుకుపోయింది. అర్జెంటీనాలో సంబరాలు హోరెత్తుతున్నాయి. పలు నగరాల్లో అభిమానులు రోడ్లపైకి వచ్చి సంబురాలు జరుపుకుంటున్నారు.