Maharashtra | మహారాష్ట్రలో ఘోరం.. సబర్బన్ రైల్లో చెలరేగిన మంటలు

Maharashtra | మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. అహ్మద్‌నగర్ నుంచి ఆష్థి వెళ్తున్న సబర్బన్ రైల్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు చోటు చేసుకుంది.
ALSO READ : Chahal-Dhanashree Divorced: విడాకులు తీసుకున్న.. క్రికెటర్ చాహల్, ధనశ్రీ వర్మ! భరణం ఎన్ని కోట్లంటే?
సబర్బన్ రైల్లోని ఐదు బోగీల్లో మంటలు చెలరేగినట్లు రైల్వే అధికారులు నిర్ధారించారు. మంటలు ఎగిసిపడిన వెంటనే ప్రయాణికులు అప్రమత్తమై కిందకు దిగారని తెలిపారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు యత్నిస్తోంది. అగ్నికీలలు ఎగిసిపడిన వెంటనే ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమ వస్తువులు పూర్తిగా కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.