Viral Video | వంట పాత్ర‌లో ఇరుక్కున్న 18 నెల‌ల చిన్నారి త‌ల‌.. చివ‌ర‌కు ఏమైందంటే..?

చిన్న పిల్ల‌లు ఆడుకుంటూనే భ‌యంక‌ర‌మైన ప‌నుల‌కు పాల్ప‌డుతుంటారు. కొంద‌రు నీళ్లు ఉన్న బ‌కెట్‌లో మునిగిపోతుంటారు. మ‌రికొంద‌రు ప్ర‌మాద‌వ‌శాత్తు పై అంత‌స్తుల నుంచి కింద‌కు ప‌డిపోతుంటారు. ఇంకొంద‌రు ఇంట్లోని వంట పాత్ర‌ల్లో త‌మ త‌ల‌ల‌ను పెట్టి తీవ్ర ఇబ్బందులకు గుర‌వుతుంటారు.

Viral Video | వంట పాత్ర‌లో ఇరుక్కున్న 18 నెల‌ల చిన్నారి త‌ల‌.. చివ‌ర‌కు ఏమైందంటే..?

Viral Video | చిన్న పిల్ల‌లు ఆడుకుంటూనే భ‌యంక‌ర‌మైన ప‌నుల‌కు పాల్ప‌డుతుంటారు. కొంద‌రు నీళ్లు ఉన్న బ‌కెట్‌లో మునిగిపోతుంటారు. మ‌రికొంద‌రు ప్ర‌మాద‌వ‌శాత్తు పై అంత‌స్తుల నుంచి కింద‌కు ప‌డిపోతుంటారు. ఇంకొంద‌రు ఇంట్లోని వంట పాత్ర‌ల్లో త‌మ త‌ల‌ల‌ను పెట్టి తీవ్ర ఇబ్బందులకు గుర‌వుతుంటారు. ఇవ‌న్నీ వారికి తెలిసి చేయ‌రు. ఏదో అలా ఆడుకుంటూ ప్ర‌మాద‌వ‌శాత్తు ఇలాంటి ప్ర‌మాదాల‌కు గుర‌వుతుంటారు.

ఓ 18 నెల‌ల బాలుడు కూడా త‌న ఇంట్లో ఆడుకుంటూ ఓ వంట పాత్ర‌ను త‌న త‌ల‌పై బోర్లించుకున్నాడు. ఇక ఆ పాత్రను తీసేందుకు ప్ర‌య‌త్నించ‌గా, అది రాలేదు. అందులోనే త‌ల ఇరుక్కుపోయింది. బాలుడు గుక్క ప‌ట్టి ఏడ్చాడు. ఆందోళ‌న‌కు గురైన తల్లిదండ్రులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు.. 30 నిమిషాల పాటు శ్ర‌మించి, పాత్ర‌లో ఇరుక్కున్న బాలుడి త‌ల‌ను బ‌య‌ట‌కు తీశారు.

ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడులోని పోరూర్‌లో మార్చి 24వ తేదీన చోటు చేసుకోగా, దానికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. బాధిత చిన్నారిని కృతిగ‌న్‌ను పోలీసులు గుర్తించారు. చిన్న‌పిల్ల‌ల‌కు దూరంగా పాత్ర‌లు, ఇత‌ర వ‌స్తువులు దూరంగా ఉంచాల‌ని పోలీసులు సూచించారు. బాలుడి త‌ల‌కు, ప్రాణాల‌కు ఎలాంటి ప్ర‌మాదం సంభ‌వించ‌క‌పోవ‌డంతో త‌ల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.