రీల్స్ చేస్తుండగా.. బంగారు గొలుసు లాక్కెళ్లిన దొంగ.. వీడియో
ఓ మహిళ కూడా ఇన్ స్టా రీల్స్ కోసం నడిరోడ్డుపై మెల్లగా నడుచుకుంటూ వెళ్తోంది. అంతలోనే ఓ చైన్ స్నాచర్ బైక్‌పై వేగంగా వచ్చి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లాడు.

లక్నో : ఇప్పుడు ప్రపంచమంతా సోషల్ మీడియాలో మునిగి తేలుతోంది. రాత్రికి రాత్రే సెలబ్రెటీ అయిపోవాలని చాలా మంది కలలు కంటున్నారు. అందుకోసం సామాజిక మాధ్యమాలను వేదికలుగా ఎంచుకుంటున్నారు. చాలా మంది యువతులు, మహిళలు ఇన్ స్టా రీల్స్ చేసి ఫేమస్ అయిపోతున్నారు. తమ క్రియేటివిటితో తక్కువ కాలంలోనే సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. అయితే ఓ మహిళ కూడా ఇన్ స్టా రీల్స్ కోసం నడిరోడ్డుపై మెల్లగా నడుచుకుంటూ వెళ్తోంది. అంతలోనే ఓ చైన్ స్నాచర్ బైక్‌పై వేగంగా వచ్చి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లాడు.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ జిల్లాలోని ఇంద్రాపురంలో వెలుగు చూసింది. బాధితురాలు సుష్మా సల్వార్ షూట్ ధరించి రీల్స్ తయారీలో నిమగ్నమైన సమయంలో ఈ చోరీ జరిగింది. సుష్మా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. చైన్ స్నాచర్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
REEL के साइड इफैक्ट –
UP के जिला गाजियाबाद में एक महिला सड़क पर REEL बनवा रही थी। बाइक सवार बदमाश आया और चेन लूटकर फरार हो गया। pic.twitter.com/THRcfo8OiW— Sachin Gupta (@SachinGuptaUP) March 24, 2024