న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం విదేశాలకి స్టార్ హీరోలు.. ఏ హీరో ఎక్కడ సెలబ్రేట్ చేసుకోనున్నాడంటే..!

ఇటీవల మన హీరోలు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీకి కొంత సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారు.పలు అకేషన్స్‌కి ఫ్యామిలీతో కలిసి విదేశాలకి వెళ్లడం కామన్‌గా మారింది.సూపర్ స్టార్ మహేష్ బాబు తరచు తన ఫ్యామిలీని తీసుకొని విదేశాలకి వెళుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఇప్పటికే దుబాయ్‌లో వాలాడు. వర్క్, సెలబ్రేషన్స్ రెండు కలిసి వచ్చేలా ఈ టూర్ ప్లాన్ చేసకున్నాడు మహేష్ బాబు. ఆడ్ ఫిలిమ్ షూట్ లో పాల్గొని , ఆ తర్వాత దుబాయ్ లోనే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని కూడా తన ఫ్యామిలీతో పాటు జరుపుకోవాలని పక్కా స్కెచ్ వేసిన మహేష్ దుబాయ్ వెళ్లినట్టు తెలుస్తుంది.
ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో చాన్నాళ్లు తీరిక లేకుండా గడిపిన ఎన్టీఆర్ ఇప్పుడు దేవర సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు. ఈ మూవీ షూటింగ్ గ్యాప్ లో ఇటీవల పలుమార్లు విదేశాలకి ఫ్యామిలీతో వెళ్లాడు. ఇక ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం జపాన్ వెళ్లినట్టు తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ షూటింగ్ కొంత భాగం జపాన్‌లో జరగగా, అక్కడ వాతావరణం లొకేషన్స్ బాగా నచ్చాయి ఇక దాంతో ఆయన ఈ సంవత్సరం కూడా న్యూ ఇయర్ వేడుకలను జపాన్ లో సెలబ్రేట్ చేసుకోవాలని అక్కడకి వెళ్లినట్టు తెలుస్తుంది. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇప్పటికే దుబాయ్ లోని అత్యంత ఎత్తైన హోటల్ లో కొన్ని రూమ్స్ బుక్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది.
ఇక రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సినిమా షూటింగ్ కోసం అమెరికా కి వెళ్లగా, అక్కడే ఈ సారి తన న్యూ ఇయర్ వేడుకలను చాలా గ్రాండ్ గా చేసుకోబోతున్నట్టు గా తెలుస్తుంది. ఇక రష్మిక మందన, పూజ హెగ్డే, శృతిహాసన్ లాంటి స్టార్ హీరోయిన్స్ సైతం విదేశాలలోనే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోబోతున్నట్టు సమాచారం. ఒకప్పుడు హైదరాబాద్‌లోనే ఎక్కువగా పార్టీలు చేసుకునే సెలబ్రిటీస్ ఈ మధ్య కాలంలో మాత్రం ఇలా విదేశాలకి వెళుతుండడం అభిమానులకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది