25-03-2024 సోమ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారు ఎవ‌రికీ అప్పులు ఇవ్వొద్దు..!

హోలీ రోజు మేషరాశి వారి జీవితాల్లో ఆనందం ఉంటుంది. ఈ రోజు ఎవరికీ అప్పులు ఇవ్వొద్దు. నూతన పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తెలివిగా తీసుకోవాలి. ఉద్యోగ, వ్యాపారాలలో కష్టనికి తగిన ఫలితం ఉంటుంది.

25-03-2024 సోమ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారు ఎవ‌రికీ అప్పులు ఇవ్వొద్దు..!

మేషం

హోలీ రోజు మేషరాశి వారి జీవితాల్లో ఆనందం ఉంటుంది. ఈ రోజు ఎవరికీ అప్పులు ఇవ్వొద్దు. నూతన పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తెలివిగా తీసుకోవాలి. ఉద్యోగ, వ్యాపారాలలో కష్టనికి తగిన ఫలితం ఉంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది.

వృషభం

దీర్ఘ‌కాలంగా పెండింగ్‌లో ఉన్న‌ పనులు పూర్తవుతాయి. కొత్త ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు ఉండవచ్చు. గత తప్పుల నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగండి. హోలీ రోజున మీ జీవితంలో రంగులు నిండాలంటే మీ ఆలోచనల్లో కొత్తదనం ఉండాలి.

మిథునం

ఈ రోజు మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగ, వ్యాపారాలలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పై అధికారుల సహకారంతో పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. కుటుంబానికి సమయం వెచ్చిస్తారు.

కర్కాటకం

ఈ రోజు మీకు చాలా శుభదినం. వృత్తి జీవితంలో శుభవార్త అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అప్పుల నుంచి విముక్తి పొందుతారు. మీ జీవిత భాగస్వామి భావాలను గౌరవించండి.

సింహం

ఈ రాశి వారు ఈరోజు ఏదో తెలియని భయం వల్ల ఆందోళన చెందుతారు. కుటుంబ సభ్యుల మద్దతు వల్ల కొంత ప్రశాంతత ఉంటుంది. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సమయం కేటాయించండి. కోపం తగ్గించుకోవాలి.

కన్య‌

ఈరోజు కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కొత్త ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీ కలలన్నీ నిజమవుతాయి. ఆదాయం పెరుగుతుంది.

తులా

ఈ రోజు మీకు అద్భుతమైన రోజు అవుతుంది. వ్యాపారంలో హెచ్చు తగ్గులు సాధ్యమే. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సమేతంగా హోలీలో ఆనందకరమైన క్షణాలను ఆస్వాదించండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

వృశ్చికం

ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. కుటుంబ సభ్యులు , స్నేహితుల సహకారంతో నూతన ఆదాయ మార్గాల గురించి అన్వేషిస్తారు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందుతారు.

ధనుస్సు

ధనుస్సు రాశి వారి జీవితాల్లో అనేక అద్భుత మార్పులు వస్తాయి. ధన ప్రవాహం పెరుగుతుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతమవుతాయి. ఈరోజు ఎవరికీ పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వకండి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.

మకరం

మీ జీవితంలో సానుకూల శక్తి ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో అజాగ్రత్తగా ఉండకండి. ఆస్తి సంబంధ వివాదాల కారణంగా ఈరోజు కొంత మందికి ఒత్తిడి పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలకు దూరంగా ఉండండి. తొందరపడి ఏ నిర్ణయమూ తీసుకోకండి.

కుంభం

ఆర్థిక విషయాలలో కుంభరాశి వారికి అదృష్టం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించండి. కొంతమంది ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. కెరీర్‌కు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు, కుటుంబ సభ్యుల సలహాలను తీసుకోండి.

మీనం

ఈ రోజు మీరు సంతోషంగా ఉంటారు. ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. గడువులోపు ముఖ్యమైన పనులను పూర్తి చేయండి. బంధాల మధ్య ఉన్న చిన్న చిన్న విభేదాలను కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి.