Horoscope | 19-03-2024 మంగళవారం రాశిఫలాలు.. ఈ రాశుల వారికి అంత అనుకూలంగా లేదు..!
జ్యోతిషం, రాశిఫలాలను చాలా మంది నమ్ముతుంటారు. రోజు వారి రాశి ఫలాలను చూసుకున్న తర్వాతే చాలా మంది తమ కార్యక్రమాలను ప్రారంభిస్తుంటారు. ఏయే రాశివారు ఆ రాశి ఫలాలకు అనుగుణంగా ముందడుగు వేస్తారు. మరి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం : ఈ రోజు మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. చక్కని ప్రణాళికతో ఉంటే ఈ రోజు చాలా సరదాగా గడిచిపోతుంది. చేసే పని సాధారణంగానే ఉంటుంది. ఈ రోజు సాయంత్రం మీ కోసం మంచి మధురక్షణాలు వేచి చూస్తున్నాయి.
వృషభం : వృషభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. ఆర్ధికంగా అనుకూలంగా ఉంటుంది. విందువినోదాల్లో పాల్గొంటారు.
మిథునం : మిథున రాశి వారు ఈ రోజు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. సానుకూల దృక్పథంతో ఉంటారు. కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. విందువినోదాల్లో పాల్గొంటారు.
కర్కాటకం : కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీ తెలివితేటలు, ఆశావహ దృక్పథంతో మీరు అనుకున్నది సాధిస్తారు. నైపుణ్యాలను మెరుగు పరుచుకుంటే నూతన అవకాశాలు తలుపు తడతాయి.
సింహం : సింహరాశి వారికి ఈ రోజు చాలా గొప్పగా ఉంటుంది. మీ శక్తిసామర్ధ్యాలను తక్కువ అంచనా వేసుకోవడం మంచిది కాదు. ఎంతటి క్లిష్ట సమస్య అయినా సునాయాసంగా పరిష్కరించగల మీ నేర్పు కారణంగా మీకు గొప్ప అవకాశాలు వస్తాయి. గొప్ప విజయాలను అందుకుంటారు.
కన్య : కన్య రాశి వారికి ఈ రోజు విజయవంతంగా ఉంటుంది. కుటుంబ సంబంధాలు బలోపేతం అవుతాయి. స్నేహితులు, బంధువులను కలిసి పరస్పర శుభాకాంక్షలు తెలుపుకోండి. విందు వినోదాల్లో పాల్గొంటారు. మొత్తానికి ఈ రోజు మంచి ఫలితాలను పొందుతారు.
తుల : తుల రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. కుటుంబ సభ్యులతో ఏర్పడే చిన్నపాటి విబేధాలు అశాంతి కలిగిస్తాయి. మీపై యజమానులు మీ పనితీరు పట్ల అసంతృప్తితో ఉండడం వలన పని ప్రదేశంలో కూడా పరిస్థితి అంత అనుకూలంగా ఉండదు.
వృశ్చికం : వృశ్చిక రాశి వారికి ఈరోజు కొన్ని చికాకులు ఎదురవుతాయి. దైవ బలం ఈ పరిస్థితుల నుంచి మిమ్మల్ని రక్షించగలవు. మాటలు ఆచితూచి మాట్లాడితే వివాదాలకు తావుండదు.
ధనుస్సు : ధనుస్సు రాశివారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. మీ ఆలోచనలను కార్యరూపంలో పెడితే మంచిది. ఒకటి అనుకోని మరొకటి చేయకూడదు. సమర్ధవంతంగా పనిచేసి మీరేంటో ఇతరులకు చూపించగలరు.
మకరం : మకర రాశివారికి ఈరోజు ప్రోత్సహకారంగా ఉంటుంది. మీరు చేపట్టే పనులకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, మద్దతు ఉంటుంది. కుటుంబం మీకు అండగా ఉంటుంది కాబట్టి ప్రపంచాన్ని ఈ రోజు జయించగలరు, దేన్నైనా సాధించగలరు.
కుంభం : కుంభ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అందరి దృష్టి మీపైనే ఉంటుంది. యజమానుల శ్రద్ధ, ప్రశంసలు మీరు మరింత కష్టించి పనిచేసేలా దారితీస్తాయి. మీ పనితీరు మీ ఉన్నతాధికారులను ఆకట్టుకుంటుంది.
మీనం : మీన రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. అనవసరమైన ఆందోళనలు పనిలో జాప్యానికి కారణం అవుతాయి. ఆందోళన ఎక్కువైతే నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యం తగ్గుతుంది. భూమి లేదా ఆస్తికి సంబంధించిన విషయాల్లో ఎలాంటి చర్చలు వద్దు.