12 మందిని క‌రిచిన గుర్రం.. ఆస్ప‌త్రి పాలైన వృద్ధ దంప‌తులు

కుక్కలు, పిల్లులు, కోతులు మ‌న‌షుల‌పై దాడి చేసి క‌రిచిన ఘ‌ట‌నలు అనేకం. ప్ర‌తి రోజు ఏదో ఒక చోట కుక్క‌లు దాడులు చేస్తూనే ఉంటాయి. ఇది కామ‌న్. అయితే ఓ గుర్రం కూడా వీటి జాబితాలో చేరిపోయింది. కుక్క‌ల మాదిరిగానే గుర్రం కూడా జ‌నాల‌ను కరిచి, గాయ‌ప‌రిచింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. మ‌హారాష్ట్ర‌లోని ఛ‌త్ర‌ప‌తి శంభాజీన‌గ‌ర్‌లో ఓ గుర్రం హ‌ల్‌చ‌ల్ సృష్టించింది. దారిలో వెళ్తున్న వృద్ధ దంప‌తుల‌పై దాడి చేసి క‌రిచింది. అక్క‌డే ఉన్న‌ మ‌రో ఆరుగురిని కూడా గుర్రం క‌రిచింది. తీవ్ర గాయాల‌పాలైన వృద్ధ దంప‌తుల‌ను ఆస్ప‌త్రిలో చేర్పించారు. అక్క‌డ్నుంచి స్థానికులు గుర్రాన్ని త‌రిమేశారు.

మ‌రో ప్రాంతానికి వెళ్లిన గుర్రం.. అక్క‌డ కూడా ప‌లువురిపై దాడి చేసి తీవ్రంగా క‌రిచింది. గుర్రం దాడితో స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. గుర్రం దాడి నుంచి స్థానికుల‌ను ర‌క్షించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను కోరారు. తీవ్ర గాయాల‌పాలైన వృద్ధ దంప‌తుల‌ను న‌ర‌హ‌రి గైక్వాడ్, సుమ‌న్ బాయిగా గుర్తించారు.