ఆ రంగు ఆవులు క‌ల‌లో వ‌స్తున్నాయా..? కానీ ఇలా క‌నిపిస్తే కీడే..!

ఆవు క‌ల‌లోకి వ‌స్తే శుభ‌ప్ర‌దమ‌ని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అందులోనూ తెల్ల ఆవులు క‌నిపిస్తే ఆ వ్య‌క్తికి ధ‌నం చేకూరుతుంద‌ని, శ్రేయ‌స్సు క‌లుగుతుంద‌ని విశ్వ‌సిస్తున్నారు. కానీ ఆవులు ఇలా క‌నిపిస్తే మాత్రం కీడే అని చెబుతున్నారు.

ఆ రంగు ఆవులు క‌ల‌లో వ‌స్తున్నాయా..? కానీ ఇలా క‌నిపిస్తే కీడే..!

ప్ర‌తి ఒక్క‌రికి నిద్ర‌లో క‌ల‌లు వ‌స్తుంటాయి. ఆ క‌ల‌లు వ‌చ్చిన‌ప్పుడు చాలా మంది ఉలిక్కి ప‌డుతుంటారు. ఏదో అరుపులు చేస్తుంటారు. తెల్లారి గుర్తుకు తెచ్చుకుందామంటే ఆ క‌ల‌లు గుర్తుకు రావు. అయితే క‌ల‌లో చాలా మందికి పాములు, జంతువులు క‌నిపిస్తుంటాయి. పాములు క‌నిపిస్తే కీడుగా భావిస్తారు. జంతువుల్లో ఆవు క‌ల‌లోకి వ‌స్తే శుభ‌ప్ర‌దమ‌ని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అందులోనూ తెల్ల ఆవులు క‌నిపిస్తే ఆ వ్య‌క్తికి ధ‌నం చేకూరుతుంద‌ని, శ్రేయ‌స్సు క‌లుగుతుంద‌ని విశ్వ‌సిస్తున్నారు. కానీ ఆవులు ఇలా క‌నిపిస్తే మాత్రం కీడే అని చెబుతున్నారు.

తెల్ల‌ని ఆవులు క‌నిపిస్తే..

నిద్రిస్తున్న స‌మ‌యంలో క‌ల‌లో తెల్ల‌ని ఆవులు క‌నిపిస్తే.. క‌ష్టానికి త‌గిన ప్ర‌తిఫ‌లం ల‌భిస్తుంద‌ని న‌మ్మ‌కం. చేయాల‌నుకున్న ప‌నులు కూడా చేస్తార‌ట‌. తెల్ల‌టి ఆవులు సంప‌ద‌, శ్రేయ‌స్సు, ఆనందానికి చిహ్నంగా భావిస్తారు.

లేగ దూడ క‌నిపిస్తే..

లేగ దూడ‌ను క‌ల‌లో క‌నిపించ‌డం మంచిద‌ని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ క‌ల జీవితంలో ఆనందాన్ని తెస్తుంద‌ట‌. ఆర్థిక లాభం వ‌స్తుంద‌ట‌. అభివృద్ధికి సంకేత‌మ‌ట‌. లేగ దూడ క‌నిపిస్తే.. విదేశాల‌కు వెళ్లాల‌నుకునే వారి క‌ల అతి త్వ‌ర‌లోనే నెర‌వేర‌బోతుంద‌ట‌.

ఆవు పాలు తాగడం

కలలో ఆవు పాలు తాగడం కూడా శుభప్రదంగా పరిగణిస్తున్నారు. దీని అర్థం త్వరలో మీరు అదృష్టవంతులు అవుతార‌ని. అలాగే విపరీతంగా డబ్బు సంపాదిస్తారు. ఇది ఆరోగ్యం, సంపద, జ్ఞానం పెరగడానికి సంకేతం. అప్పటి వరకు అనారోగ్య సమస్యలతో బాధ పడే వారికి ఉపశమనం లభిస్తుంది.

ఆవును చంపిన‌ట్లు క‌నిపిస్తే..

కలలో ఆవును చంపడం అశుభంగా పరిగణిస్తారు. ఈ కల మీరు భవిష్యత్తులో పాపం చేస్తారని సూచిస్తుంది. మీరు జీవితంలో ఇంత వరకు చూడని కష్టాలను కూడా ఎదుర్కొంటారు.

ఆవుల మంద క‌నిపిస్తే..

స్వప్న శాస్త్రం ప్రకారం, కలలో ఆవుల మందను చూడటం చాలా మంచి సంకేతం. ఈ కల ఎవరికీ వస్తే వారు.. ఆర్థిక పరిస్థితులు మొత్తం మారిపోతాయి. కొన్నిసార్లు ఊహించని విధంగా మీ దగ్గరికి డబ్బు చేరుతుంది.