సౌతాఫ్రికా టూర్ మ్యాచ్ డీటైల్స్ ఇవే.. మ్యాచ్ టైమింగ్ ఎప్పుడంటే..!

సౌతాఫ్రికా టూర్ మ్యాచ్ డీటైల్స్ ఇవే.. మ్యాచ్ టైమింగ్ ఎప్పుడంటే..!

సొంత‌గ‌డ్డ‌పై ఆస్ట్రేలియాకి చుక్క‌లు చూపించిన భార‌త ఆట‌గాళ్లు ఇప్పుడు సఫారీ జ‌ట్టుతో త‌ల‌ప‌డేందుకు సిద్ధ‌మ‌య్యారు. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా భార‌త జ‌ట్టు డిసెంబ‌ర్ 10 నుండి మూడు ఫార్మాట్ల సిరీస్‌ను ఆడనుంది. టీ20 సిరీస్‌తో భారత్‌- దక్షిణాఫ్రికా టూర్‌ ప్రారంభం కానుండ‌గా, తొలి టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ డిసెంబర్ 10న డర్బన్‌లో జరగనుంది.ఈ పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరం కాగా, టెస్ట్ మ్యాచ్‌ల‌కి అందుబాటులో ఉండ‌నున్నారు. వైట్‌బాల్ సిరీస్‌లకు రోహిత్ శర్మ దూరంగా ఉండటంతో టీ20 సిరీస్‌‌కు సూర్యకుమార్ యాదవ్, వన్డేల్లో కేఎల్ రాహుల్ జట్టుకి నాయ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను అందుకోనున్నారు.

ఇక వ‌ర‌ల్డ్ క‌ప్‌లో చీలమండ గాయానికి గురైన హార్దిక్ పాండ్యా.. ఈ పర్యటన మొత్తానికి దూరమయ్యాడు. సుమారు రెండు నెలల పాటు భారత ఆటగాళ్లు సౌతాఫ్రికా పర్యటన ఉండ‌నుంది.అయితే ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా టీ20 సిరీస్ షెడ్యూల్ చూస్తే.. తొలి టీ20: డిసెంబర్ 10, డర్బన్ వేదికగా.. రాత్రి 7.30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇక రెండో టీ20: డిసెంబర్ 12, జిక్యూబెర్హా వేదికగా.. రాత్రి 8.30 గంటలకు ప్రారంభం. మూడో టీ20: డిసెంబర్ 14, జోహన్నెస్‌బర్గ్ వేదికగా.. రాత్రి 8.30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఆ త‌ర్వాత ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా వన్డే సిరీస్ షెడ్యూల్ మొద‌లు అవుతుంది. తొలి వన్డే: డిసెంబర్ 17, జోహెన్నస్‌బర్గ్ వేదికగా.. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం. రెండో వన్డే: డిసెంబర్ 19, జిక్యూబెర్హా వేదికగా సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం.మూడో వన్డే: పార్ల్ వేదికగా.. సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం.

ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ షెడ్యూల్ చూస్తే.. తొలి టెస్ట్: డిసెంబర్ 26 నుంచి 30 వరకు, సెంచూరియన్ వేదికగా.. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం, రెండో టెస్ట్: జనవరి 3 నుంచి 7 వరకు, కేప్‌టౌన్ వేదికగా.. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం అవుతుంది. అయితే సౌతాఫ్రికా జ‌ట్టు ప‌రిమిత ఓవ‌ర్ల మ్యాచ్‌కి జట్టు కమాండ్‌ను ఐడెన్ మార్క్‌రామ్‌కు అప్పగించారు. టెస్ట్ జ‌ట్టుకి బ‌వుమా నాయ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ని అందుకుంటారు.