శ్రీముఖి అదొక్కటి చేయ‌వా అంటూ వేడుకున్న ఇంట‌ర్ విద్యార్థి..మ‌రి స్పందించిందా లేదా?

శ్రీముఖి అదొక్కటి చేయ‌వా అంటూ వేడుకున్న ఇంట‌ర్ విద్యార్థి..మ‌రి స్పందించిందా లేదా?

ప్ర‌స్తుతం బుల్లితెర‌పై యాంక‌ర్స్‌గా రాణిస్తున్న వారిలో శ్రీముఖి టాప్ ప్లేస్‌లో ఉంది. ప‌టాస్ షోతో మంచి ఫేమ‌స్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు షోస్, ఈవెంట్స్ చేస్తూ ఫుల్ బిజీ అయింది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో కూడా తెగ సంద‌డి చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం శ్రీముఖి చేతిలో ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ , ‘కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్ సీజన్ 2’ వంటి షోలు ఉన్నాయి. వీటితో పాటు సింగింగ్ ప్రోగ్రామ్ అయిన ‘సూపర్ సింగర్’ రియాలిటీ షోకు కూడా వ్యాఖ్యతగా వ్యవహరిస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ షో చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. మ‌రి కొద్ది రోజుల‌లో సెమీస్ జ‌ర‌గ‌నుండ‌గా, వాటిలో శ్రీముఖి బ్యూటీఫుల్ లుక్‌లో మెర‌వ‌డం ఖాయ‌మ‌ని అంద‌రు భావిస్తున్నారు.

తాజాగా శ్రీముఖి త‌న సోష‌ల్ మీడియాలో కొన్ని క్యూట్ ఫొటోస్ షేర్ చేసింది. బ్లూ లెహంగా, వోణీలో శ్రీముఖి లుక్ ప్ర‌తి ఒక్కరిని ఆక‌ట్టుకుంటుంది. ఆమెని చూసి ప్ర‌తి ఒక్క‌రు మంత్రముగ్ధులు అవుతున్నారు. నెటిజ‌న్స్ క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఓ ఇంట‌ర్ విద్యార్థి శ్రీముఖి ఫొటోల‌కి క్రేజీ కామెంట్ చేశాడు. శ్రీముఖి అక్క మీ ఫొటోషూట్ సూప‌ర్భ్. ఈ డ్రెస్ లో మీరు చాలా అందంగా క‌నిపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇంటర్ పరీక్షలు రాస్తున్నాను. నాకు ఆల్ ది బెస్ట్ చెప్పావా ప్లీజ్.. అంటూ కామెంట్ చేయడం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

మ‌రి విద్యార్థి రిక్వెస్ట్‌ని శ్రీముఖి ఆల‌కిస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది. ఇక శ్రీముఖి ఓ వైపు బుల్లితెర‌పై షోస్‌ చేస్తూనే మరోవైపు సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. అడపాదడపా వెండితెర‌పై మెరస్తూ అలరిస్తుంది. ఇటీవ‌ల శ్రీముఖి త‌న‌ని కొంద‌రు బాడీ షేమింగ్ చేసార‌ని పేర్కొంది.నేను బొద్దుగా యుక్త వయసులో ఉన్నప్పుడు , ఇతరులు నన్ను బాడీ షేమ్ చేసారు. ఆ స‌మ‌యంలో మా అమ్మ ఎప్పుడు నా వెంటే ఉండి నన్ను ప్రోత్సహించింది. ప్రేమించింది, పాంపర్‌ చేసింది. ఇంకా నన్ను బలపరిచింది. మా అమ్మకి ఎప్పుడు రుణ‌ప‌డి ఉంటానంటూ ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేసింది శ్రీముఖి. ఆ కామెంట్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.