దీపికా ప‌దుకొణేతో పాటు 40 ఏళ్ల వ‌య‌స్సులో త‌ల్లి కాబోతున్న మ‌రో హీరోయిన్.. ఎవ‌రంటే..!

దీపికా ప‌దుకొణేతో పాటు 40 ఏళ్ల వ‌య‌స్సులో త‌ల్లి కాబోతున్న మ‌రో హీరోయిన్.. ఎవ‌రంటే..!

ఈ ఏడాది చాలా మంది హీరోయిన్స్ పెళ్లి పీట‌లు ఎక్క‌డ‌మే కాదు కొంద‌రు తాము త‌ల్లి ప్రమోష‌న్ అందుకోబోతున్నట్టు కూడా తెలియ‌జేస్తున్నారు. రీసెంట్‌గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే తాను ప్ర‌గ్నెంట్‌గా ఉన్నాన‌ని త్వ‌ర‌లో త‌ల్లి కాబోతున్న‌ట్టు తెలియ‌జేసి ఫ్యాన్స్‌కి ఫుల్ ఖుషీని పంచింది. ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ కూడా గుడ్ న్యూస్ చెప్పడానికి రెడీగా ఉంద‌ని తెలుస్తుంది. 40 ఏళ్ల వ‌యస్సులో ఆమె తల్లి కాబోతుంద‌ని తెలుస్తుండ‌గా, ఇది తెలిసి ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇంత‌కు ఎవ‌రు ఆ హీరోయిన్ అనే క‌దా మీ డౌట్. పొడుగు కాళ్ల సుంద‌రి క‌త్రినా కైఫ్.

టాలీవుడ్ లో వెంకటేష్ జోడీగా మ‌ల్లీశ్వ‌రి అనే మూవీ చేసి తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న క‌త్రినా కైఫ్ ఆ త‌ర్వాత బాలీవుడ్‌లో వ‌రుస పెట్టి సినిమాలు చేసి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. స్టార్ హీరోల పక్కన నటించడంతో పాటు.. మంచి హిట్స్ అందుకోవ‌డంతో క‌త్రినా కైఫ్‌కి స్టార్ ఇమేజ్ ద‌క్కింది. ఈ క్ర‌మంలో లక్షల మంది అభిమానులు సొంతం చేసుకుంది. అయితే క‌త్రినా కైఫ్ పర్స‌న‌ల్ లైఫ్‌కి అనేక గాసిప్స్ నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతూ ఉండేవి. ప‌లువురితో ప్రేమాయ‌ణం న‌డుపుతుంద‌ని, అందులోఓ వ్య‌క్తిని పెళ్లి కూడా చేసుకోనుందంటూ అప్ప‌ట్లో తెగ పుకార్లు వ‌చ్చేవి.

అయితే చివరికి యంగ్ హీరో.. తనకంటే ఐదేళ్లు చిన్నవాడైన విక్కీ కౌశల్ ను ప్రేమించి పెళ్ళాడి అంద‌రికి పెద్ద షాక్ ఇచ్చింది క‌త్రినా కైఫ్‌. ఇక పెళ్లైన త‌ర్వాత త‌న భ‌ర్త‌తో క‌లిసి వైవాహిక జీవితం సంతోషంగానే గ‌డుపుతుంది. రీసెంట్‌గా క‌త్రినా కైఫ్ ముఖేశ్‌ అంబానీ కుమారుడు అనంత్‌ అంబానీ ప్రీ వెడ్డింగ్ లో త‌న భ‌ర్త‌తో క‌నిపించింది. ఆ వేడుక‌లో క‌త్రినా కైఫ్ త‌న క‌డుపుని దుప‌ట్టాతో ప‌దే ప‌దే దాచుకోవ‌డం జ‌రిగింది. ఇది చూసి క‌త్రినా కైఫ్ కూడా ప్ర‌గ్నెంట్ అని అందుకే ఆమె అలా చేసింద‌ని కొంద‌రు చెప్పుకొస్తున్నారు. అయోధ్య రామాలయ ప్రతిష్ట టైమ్ లో కూడా క‌త్రినా బేబి బంప్ క‌నిపించిన‌ట్టు ప్ర‌చారం చేశారు. అయితే ఇప్ప‌టికే క‌త్రినా ప్ర‌గ్నెన్సీపై క్లారిటీ అయితే లేదు. ఇక విక్కీ కౌశల్‌, కత్రినా కైఫ్‌ పెళ్ళి 2021, డిసెంబర్‌లో జరిగింది.