ఎట్టకేలకు అసెంబ్లీకి కేసీఆర్
ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్ ఎట్టకేలకు సుద్థీర్ఘ విరామానంతరం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఆయన ముందుగా బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయానికి చేరుకుని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు.

KCR in to the assembly : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్ ఎట్టకేలకు సుద్థీర్ఘ విరామానంతరం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఆయన ముందుగా బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయానికి చేరుకుని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు.
గవర్నర్ ప్రసంగం సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు రుణమాఫీ, రైతు భరోసా, వరికి రూ.500 బోనస్ ఇవ్వలేదని నినాదాలు చేశారు. సంపూర్ణ రుణమాఫీ చేయాలని, పంట బోనస్ ఇవ్వాలని పట్టుబట్టారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల నినాదాల మధ్యనే గవర్నర్ ప్రసంగం కొనసాగింది. గవర్నర్ ప్రసంగం అనంతరం కేసీఆర్ బయటకు వెళ్లిపోయారు.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత టి.హరీష్ రావులు మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగంపై విమర్శలు గుప్పించారు. రేపు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మాణంపై చర్చ కొనసాగనుంది. 14న హోలీ సందర్బంగా అసెంబ్లీకి సెలవు. 15వ తేదీన ధన్యవాద తీర్మాణంపై చర్చ కొనసాగుతోంది. 16వ తేదిన ఆదివారం అసెంబ్లీకి సెలవు.
17న ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధతపై చర్చ, 18న బీసీ కుల గణన, రిజర్వేషన్లపై చర్చ. 19న 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవెశపెట్టనున్న ప్రభుత్వం. 20న అసెంబ్లీకి సెలవు. 21వ తేది నుంచి బడ్జెట్ పై చర్చ. 27 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి.