బాబోయ్ కీర్తి సురేష్ ఏంటి ఇంత హాట్‌గా మారింది.. కిల్లింగ్ లుక్స్‌తో కేక పెట్టిస్తుందిగా..!

కీర్తి సురేష్ పేరు చెబితే మనందరికి మహానటి సినిమా గుర్తుకు వస్తుంది. ఆ చిత్రంలో సావిత్రి పాత్రలో ఒదిగిపోయి దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల మనసులని కొల్లగొట్టింది. ఈ సినిమాతో కీర్తి సురేష్‌కి నేషనల్ అవార్డ్ కూడా దక్కింది. ఈ ముద్దుగుమ్మ ఇటీవలి కాలంలో మంచి సక్సెస్‌లు అందుకుంటూ దూసుకుపోతుంది. తనకి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకుంటుంది. ఒకవైపు లేడి ఓరియెంటెడ్ సినిమాలు, మరోవైపు కమర్షియల్ చిత్రాలు, ఇంకోవైపు చెల్లెలి పాత్రలలో నటిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకుంటుంది. దసరా సినిమాతో గత ఏడాది తెలుగులో బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్న కీర్తిసురేష్. ఈ సినిమా రిలీజై దాదాపు ఏడాది అవుతోన్న సోలో హీరోయిన్‌గా తెలుగులో మరో మూవీకి కీర్తిసురేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
ఇక చిరంజీవితో కలిసి నటించిన భోళా శంకర్ మూవీ కీర్తిసురేష్‌కు పూర్తి నిరాశనే మిగిల్చింది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటించింది. రజనీకాంత్ సోదరిగా కూడా కీర్తి నటించింది. అయితే ప్రస్తుతానికి తెలుగులో పెద్దగా సినిమాలు చేయని కీర్తి సురేష్ తమిళంలో మాత్రం నాలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. సైరన్, రఘుతాత, రివాల్వర్ రీటా తో పాటు మరో సినిమా చేస్తోంది. వెబ్‌సిరీస్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది కీర్తిసురేష్. అక్క పేరుతో హిందీలో ఓ వెబ్‌సిరీస్ చేస్తోంది. ఇందులో కీర్తిసురేష్‌తో పాటు రాధికా ఆప్టే మరో కీలక పాత్ర పోషిస్తోంది
ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగు తో పాటు తమిళ సినిమాల్లో నటిస్తూ ఇటు టాలీవుడ్ , అటు కోలీవుడ్ రెండు ఇండస్ట్రీ లలో కూడా స్టార్ హీరోయిన్ గా తన హవా చూపిస్తుంది. ఇక సోషల్ మీడియాలోను ఈ భామ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన అందాలను ఆరబోస్తూ వస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తుంది. తాజాగా ఈ భామ హోయలు పోతూ తన ఎద అందాలని ఆరబోసింది. కుర్రకారు ఈ భామ అందాలకి మంత్ర ముగ్ధులు అవుతున్నారు. కీర్తి సురేష్‌లో ఇంత హాట్ నెస్ ఉందా అని అందరు ఆశ్చర్యపోతున్నారు. కీర్తి ఎక్కువ శాతం మాత్రం తన సోషల్ మీడియా అకౌంట్ లో క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. కాని ఈ సారి మాత్రం హద్దులు దాటి మంత్ర ముగ్ధులని చేసిందనే చెప్పాలి.