భార్యను చంపి.. దండేసి నివాళులర్పించి..
విధాత: గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తే.. భార్య పాలిట యముడయ్యాడు. ఒక్క కత్తి పోటుతో ఏడడుగుల బంధానికి ముగింపు పలికాడో భర్త.. వివరాల్లోకి వెళితే.. తెనాలి పరిధిలోని గాంధీనగర్‌కు చెందిన వివాహిత స్వాతి బ్యూటిపార్లర్ నడుపుతోంది. స్థలం అమ్మి డబ్బులివ్వాలని భార్యతో తరచూ గొడవ పడుతున్న భర్త.. ఇవాళ బ్యూటీపార్లర్‌కు వెళ్లి ఆమెను కత్తితో అత్యంత దారుణంగా పొడిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తర్వాత తనతో పాటు ముందే […]

విధాత: గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తే.. భార్య పాలిట యముడయ్యాడు. ఒక్క కత్తి పోటుతో ఏడడుగుల బంధానికి ముగింపు పలికాడో భర్త.. వివరాల్లోకి వెళితే..
తెనాలి పరిధిలోని గాంధీనగర్‌కు చెందిన వివాహిత స్వాతి బ్యూటిపార్లర్ నడుపుతోంది. స్థలం అమ్మి డబ్బులివ్వాలని భార్యతో తరచూ గొడవ పడుతున్న భర్త.. ఇవాళ బ్యూటీపార్లర్‌కు వెళ్లి ఆమెను కత్తితో అత్యంత దారుణంగా పొడిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
ఆ తర్వాత తనతో పాటు ముందే తెచ్చుకున్న పూల దండను భార్య మృతదేహంపై వేసి నివాళులర్పించాడు. అనంతరం తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్‌లో భర్త కోటేశ్వరరావు లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.