కొత్త పెళ్లి కూతురు కుర‌చ దుస్తుల‌లో ఇంత ర‌చ్చ లేపితే కుర్రాళ్లు ఏమై పోవాలి..!

కొత్త పెళ్లి కూతురు కుర‌చ దుస్తుల‌లో ఇంత ర‌చ్చ లేపితే కుర్రాళ్లు ఏమై పోవాలి..!

అందాల రాక్ష‌సి లావ‌ణ్య త్రిపాఠి మెగా హీరో వ‌రుణ్ తేజ్‌తో దాదాపు ఐదేళ్ల‌కి పైగా ప్రేమ‌లో ఉండి ఈ ఏడాది జూన్ 9న నిశ్చితార్థం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఇక నవంబర్ 3న ఇటలీలో వీరి వివాహం గ్రాండ్ గా జర‌గ‌గా, 5న రిసెప్షన్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ రిసెప్షన్ వేడుక‌కి ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు ప్రముఖులు, సెలబ్రెటీలు హాజరై ఆశీర్వదించారు.. హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అయితే మెగా కోడ‌లిగా ప్ర‌మోష‌న్ ద‌క్కించుకున్న త‌ర్వాత లావ‌ణ్య త్రిపాఠి తెగ సంద‌డి చేస్తుంది. సోష‌ల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ వెరైటీ డ్రెస్సుల‌లో ద‌ర్శ‌న‌మిస్తూ కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది.

అదిరిపోయే అవుట్ ఫిట్లలో లావన్య త్రిపాఠి చేసే స్ట‌న్నింగ్ ఫొటో షూట్స్ కేక పెట్టిస్తున్నాయి. మైండ్ బ్లోయింగ్ స్టిల్స్ తో ప్ర‌తి ఒక్క‌రిని కట్టిపడేస్తోంది. తాజాగా వరుణ్ తేజ్ తో కలిసి ఈ ముద్దుగుమ్మ‌ చేసిన ఓ బ్యూటీఫుల్ ఫొటోషూట్ నెటిజ‌న్స్‌ని తెగ ఆకట్టుకుంది. ఇందులో లావణ్య త్రిపాఠి బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. బ్లాక్ గౌన్ లాంటి డ్రెస్ లో లావణ్య పాలనురగలా అందాలను పొంగించింది.మిలమిల మెరిసిపోతూ తన రూపసౌందర్యం, టాప్ అందాలను ప్రదర్శిస్తూ మతులు పోగొట్టింది.పెళ్లి తర్వాత మరింతగా డోస్ పెంచుతూ లావ‌ణ్య చేస్తున్న ఈ అందాల అరాచ‌కం ప్ర‌తి ఒక్క‌రికి షాకింగ్‌గా మారింది.

లావ‌ణ్య త్రిపాఠి పంచుకునే గ్లామర్ ఫొటోలకు అభిమానులతో పాటు నెటిజన్లు కూడా క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే లావ‌ణ్య త్రిపాఠి, వ‌రుణ్ తేజ్ పెళ్లి ప‌నుల నుండి కాస్త రిలీఫ్ అవుతున్నారు. వ‌రుణ్ తేజ్ త‌ను క‌మిట్ అయిన సినిమాలని పూర్తి చేసి ఆ త‌ర్వాత హ‌నీమూన్ ప్లాన్ వేయాల‌ని అనుకుంటున్న‌ట్టు స‌మాచారం. ఇక లావ‌ణ్య త్రిపాఠి ఓ వెబ్ సిరీస్‌తో పాటు త‌మిళ సినిమా ఒక‌టి చేస్తుండ‌గా, ఇవి పూర్త‌య్యాక పూర్తిగా సినిమాల‌కి దూర‌మై నిర్మాత‌గా స‌త్తా చాటే ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని ఇండ‌స్ట్రీలో టాక్ న‌డుస్తుంది. ప్ర‌స్తుతం అయితే లావ‌ణ్య త్రిపాఠి పిక్స్ మాత్రం ఇప్పుడు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయ‌నే చెప్పాలి.