హాలీవు్‌డ్ హీరోల‌ని మించిన అందంతో మ‌హేష్ బాబు..రాజ‌మౌళి మూవీలో ఈ లుక్‌తోనే క‌నిపిస్తారా..!

హాలీవు్‌డ్ హీరోల‌ని మించిన అందంతో మ‌హేష్ బాబు..రాజ‌మౌళి మూవీలో ఈ లుక్‌తోనే క‌నిపిస్తారా..!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలలో ఒక‌రు. ఆయ‌న వ‌రుస హిట్స్ కొడుతూ స్టార్ స్టేట‌స్ సంపాదించుకున్నాడు. చివ‌రిగా గుంటూరు కారం అనే చిత్రాన్ని త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌గా, ఈ మూవీ ఓ మోస్త‌రు విజ‌యాన్ని అందుకుంది.అయితే చిత్రంలో మ‌హేష్ ఊర‌మాస్ లుక్‌తో పాటు ఆయ‌న ప‌ర్‌ఫార్మెన్స్, డ్యాన్స్ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. పోకిరి త‌ర్వాత మ‌ళ్లీ మ‌హేష్ బాబుని మాస్ లుక్‌లో చూసిన ఫ్యాన్స్ థ్రిల్ అయిపోయారు.ఇక త్వ‌ర‌లో రాజ‌మౌళి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మార‌బోతున్నాడు మ‌హేష్ బాబు.

గ‌త కొద్ది రోజులుగా రాజ‌మౌళి- మ‌హేష్ బాబు సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. మ‌హేష్ బాబు కూడా సినిమాకి సంబంధించిన ప‌నుల‌లో భాగంగా ఓ సారి విదేశాల‌కి కూడా వెళ్లి వ‌చ్చాడు. ఉగాదికి ఈ మూవీ లాంచ్ కానుంద‌ని, ఆ త‌ర్వాత మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంద‌ని స‌మాచారం. అయితే చిత్రంలో మ‌హేష్ బాబు లుక్ ఎలా ఉంటుంది, ఆయ‌న పాత్ర‌తీరు తెన్నులు ఎలా ఉంటాయ‌ని ప్ర‌తి ఒక్క‌రు జోరుగా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ఈ స‌మ‌యంలో ఆయ‌న‌కి సంబంధించిన ప‌లు ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. బ్లాక్‌ కోట్‌ ధరించి, స్టయిలీష్‌ గ్లాసెస్‌ ధరించి హాలీవుడ్ హీరోల‌ని మించిన అందంతో క‌నిపిస్తున్నాడు మహేష్‌. లేటెస్ట్ లుక్ చూసి ఇదే రాజ‌మౌళిలో మ‌హేష్ లుక్ అంటున్నారు.

చిత్రంలో మ‌హేష్ బాబు ఆఫ్రిక‌న్ అడ‌వుల్లో సాహ‌సికుడి పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ని స‌మాచారం. ఇప్ప‌టికే ఆయన పాత్ర కోసం మ‌హేష్ మేకోవ‌ర్ అవుతున్నాడు. విదేశీ ట్రైనర్‌ సమక్షంలో తీసుకుంటున్నాడు. ఇక మ‌హేష్ బాబు లుక్ కోసం రాజ‌మౌళి ఎనిమిది ర‌కాల లుక్ టెస్ట్‌లు చేయ‌గా, అందులో ఇప్ప‌టికే ఒక‌టి ఫైన‌ల్ చేశార‌ని అంటున్నారు. తాజా లుక్ రాజ‌మౌళి సినిమా కోస‌మా లేకుంటే ఏదైనా బ్రాండ్‌ ప్రమోషన్‌ కోసమా అనే దానిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. ఇక రాజ‌మౌళి- మ‌హేష్ మూవీని వెయ్యి కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించ‌బోతున్న విష‌యం తెలిసిందే