చిరంజీవితో పాటు మ‌రో ఇద్ద‌రిపై ప‌రువు న‌ష్టం దావా.. ఎవ‌రు వేశారంటే..!

చిరంజీవితో పాటు మ‌రో ఇద్ద‌రిపై ప‌రువు న‌ష్టం దావా.. ఎవ‌రు వేశారంటే..!

ఇటీవ‌ల అందాల ముద్దుగుమ్మ త్రిష వ్య‌వ‌హారం ఎంత చ‌ర్చ‌నీయాంశం అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌మిళ న‌టుడు మ‌న్సూర్ అలీ ఖాన్.. కొద్ది రోజుల క్రితం లియో చిత్రంలో త్రిషతో రేప్ సీన్ ఉంటుందని ఆశపడ్డాను. త్రిషను నా చేతులతో ఎత్తుకుని బెడ్‌ రూమ్‌లో వేసే సన్నివేశం ఉంటుందని భావించాను. కాని ద‌ర్శ‌కుడు త్రిష‌ని క‌నీసం చూసే అవ‌కాశం ఇవ్వ‌లేదు. చాలా రేప్ సీన్స్ చేసిన నాకు ఇది కొత్త‌గా ఉంటుంద‌ని అనుకున్నాను అంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేయ‌డంతో దీనిపై సినీ ఇండ‌స్ట్రీకి సంబంధించి చాలా మంది ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చిరంజీవి, త్రిష‌,ఖుష్బూ వంటి వారు మ‌న్సూర్ ఆలీ ఖాన్‌పై మండిప‌డ్డారు కూడా. అయితే త‌న ప‌రువుకు వీరు భంగం క‌లిగించారంటూ కోర్టుకు వెళ్లారు మ‌న్సూర్.

సోషల్ మీడియా వేదికగా తన పరువుకు భంగం కలిగించేలా చిరంజీవి, త్రిష‌, ఖుష్బూ చేసార‌ని వారిపై కేసు వేసినట్లు ఓ స్టేట్​మెంట్​ ద్వారా తెలిపారు. మొత్తం వీడియోను చూడకుండా తన ప్రతిష్టను దిగజార్చారంటూ ఆరోపించిన ఆయన, వారి నుంచి ఆయన రూ.1 కోటి డిమాండ్ చేశారు. సోమవారం (డిసెంబర్ 11)న మద్రాసు హైకోర్టులో విచారణ జరగనుంది. మ‌రి దీనిపై చిరు, త్రిష‌, ఖుష్బూల‌లో ఎవ‌రైన స్పందిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. కాగా, మ‌న్సూర్‌పై చాలా ఆరోప‌ణ‌లు వ‌చ్చిన త‌ర్వాత ఆయ‌న ఒక స్టేట్‌మెంట్ విడుద‌ల చేశారు. త్రిషపై తనకెంతో మంచి అభిప్రాయం ఉందని, ఆమెను గౌరవిస్తున్నానని చెప్పారు.

తాను సరదాగా చెప్పిన వ్యాఖ్యలపై ఇలాంటి దుమారంరేగుతుంద‌ని తాను భావించ‌లేదంటూ మన్సూర్ అన్నారు.. నేను ఎవరినో, ఎలాంటి వాడినో అందరికీ తెలుసు అని ఇన్​స్టాగ్రామ్ స్టోరీలో​ రాసుకొచ్చారు. అయితే ఆయన వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్‌ సీరియస్‌గా తీసుకుంది. ఆ స్టేట్​మెంట్​ను సుమోటోగా స్వీకరించి మన్సూర్‌పై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. మహిళల గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే అస్స‌లు సహించేదిలేదని తెలిపింది. ఆ తర్వాత సోషల్​ మీడియా వేదికగా మన్సూర్ అలీఖాన్ త్రిషకు క్షమాపణలు చెప్ప‌డం కూడా జ‌రిగింది.