Viral Video | రైల్వే ఎంక్వైరీ ఆఫీస‌ర్‌గా కోతి.. కీ బోర్డు టైప్ చేస్తూ హంగామా

Viral Video | రైల్వే ఎంక్వైరీ ఆఫీస‌ర్‌గా కోతి.. కీ బోర్డు టైప్ చేస్తూ హంగామా

Viral Video | కోతుల‌కు, మ‌న‌షుల‌కు చాలా ద‌గ్గ‌ర పోలిక‌లు ఉంటాయి. మ‌న‌షుల మాదిరిగానే కోతులు కొన్ని ప‌నులు చేసి అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటాయి. అంతేకాదు.. మ‌న‌షుల‌కు తామేం తీసిపోం అన్న‌ట్టుగా కోతులు బిల్డ‌ప్ ఇస్తుంటాయి. అలా.. ఓ కోతి ఏకంగా రైల్వే కార్యాల‌యంలోకి ప్ర‌వేశించి, ఎంక్వైరీ ఆఫీస‌ర్ సీట్లో కూర్చొని హంగామా సృష్టించింది. ఇక రైల్వే వ్య‌వ‌స్థ‌ను తానే న‌డిపిస్తున్న‌ట్లు ఆ వానరం ఫోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

ప‌శ్చిమ బెంగాల్‌లోని ఓ రైల్వే కార్యాల‌యంలోకి కోతి ప్ర‌వేశించింది. అనంత‌రం ఖాళీగా ఉన్న రైల్వే విచార‌ణ అధికారి సీట్లో ఆ కోతి ఆసీనులైంది. ఇక కీ బోర్డును టైప్ చేస్తూ.. ప్ర‌యాణికులకు స‌మాచారాన్ని చేర‌వేస్తున్న‌ట్లు బిల్డ‌ప్ ఇచ్చింది. సీరియ‌స్‌గా పేప‌ర్ల‌ను తిరిగేసింది. కోతి చేష్ట‌ల‌ను అక్క‌డున్న ప్ర‌యాణికులు, రైల్వే సిబ్బంది త‌మ స్మార్ట్ ఫోన్ల‌లో చిత్రీక‌రించి, సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేశారు.