బోయ‌పాటితోనే మోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీ.. ఎప్పుడు లాంచ్ కానుందంటే..!

  • By: sn    breaking    Mar 18, 2024 12:58 PM IST
బోయ‌పాటితోనే మోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీ.. ఎప్పుడు లాంచ్ కానుందంటే..!

నంద‌మూరి బాల‌కృష్ణ వార‌సుడు మోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీ గురించి గ‌త కొద్ది రోజులుగా నెట్టింట అనేక ప్ర‌చారాలు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఆయన అరంగేట్రం గురించి గత నాలుగేళ్లుగా చ‌ర్చ జ‌రుగుతున్నా కూడా ఎలాంటి క్లారిటీ రావ‌డం లేదు. ఎప్పుడు మోక్ష‌జ్ఞ సినిమా లాంచ్ అవుతుందా అని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మోక్షజ్ఞ తన తొలి సినిమాను ఏ బ్యానర్ లో చేయబోతున్నారు? నిర్మాత ఎవరు? అతన్ని పరిచయం చేసే దర్శకుడు ఎవరు? అనే విష‌యంపై సోష‌ల్ మీడియాలో ప‌లు వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

బాలయ్యకు సన్నిహితుడైన వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి మోక్షజ్ఞతో సినిమా చేసేందుకు అడ్వాన్స్ కూడా ఇచ్చార‌నే టాక్ న‌డిచింది. అయితే మోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీకి సంబంధించి ఎన్ని ప్ర‌చారాలు సాగిన కూడా ప‌క్కా క్లారిటీ అయితే రావ‌డం లేదు. ఒక‌ప్పుడు మోక్ష‌జ్ఞ చాలా లావుగా ఉండేవాడు. ఇప్పుడు స్లిమ్‌లోకి వ‌చ్చేశాడు. సినిమా కోస‌మే మోక్ష‌జ్ఞ న‌యా లుక్‌కి మారాడ‌ని అంటున్నారు.ఆయ‌న‌ని లాంచ్ చేసేది బోయ‌పాటి అని అంటున్నారు. బోయపాటి మోక్షజ్ఞ సినిమా స్క్రిప్ట్ గురించి ఇప్పటికే డిస్క‌ష‌న్స్ కూడా జరిగాయని ,మోక్ష‌జ్ఞ డెబ్యూ సినిమాకి మాస్ డైరెక్టర్ అయితే స‌రిగ్గా స‌రిపోతాడ‌ని అంటున్నారు.

ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్న ఈ వార్త చూసి నంద‌మూరి అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. నందమూరి మోక్షజ్ఞ సినిమాల్లోకి రావాలని, స్టార్​హీరోగా బ్రాండ్​ను క్రియేట్ చేసుకుని, వరుస విజయాలను అందుకోవాలని నందమూరి అభిమానులు ఎన్నో క‌ల‌లు కంటున్నారు. మ‌రి వారి క‌ల‌ల‌ని మోక్ష‌జ్ఞ ఎప్పుడు నిజం చేస్తాడా అని ఎదురు చూస్తున్నారు. ఆదిత్య 369 సీక్వెల్‌తో బాలయ్య త‌న త‌న‌యుడిని ప‌రిచ‌యం చేస్తాడ‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌ర‌గ‌గా, దానిపై ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ రావ‌డం లేదు. ఇక బాల‌య్య విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం రాజ‌కీయాలు, సినిమాల‌తో బిజీగా ఉన్నారు. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో బాలయ్య చేస్తున్న సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకున్నట్టు తెలుస్తుంది.