ఏంటి.. గీతా మాధురి, నందు విడాకులు తీసుకున్నారా..అసలు నిజం ఏంటి?

ఇటీవల కాలంలో సెలబ్రిటీలు విడాకుల వార్తలు ఎక్కువ వింటున్నాం. ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు అనుకోని కారణాలతో విడిపోతుండడం అందరికి షాకింగ్‌గా మారింది. ఎప్పుడైతే సమంత- నాగ చైతన్యలు విడాకులు తీసుకున్నట్టు ప్రకటించారో అప్పటి నుండి చాలా మంది సెలబ్స్ కూడా విడాకుల బాట పట్టారు. ధనుష్-ఐశ్వర్య అలానే శ్రీజ- కళ్యాణ్ దేవ్, నిహారిక- చైతన్యలు విడాకులు తీసుకొని సోలో లైఫ్ గడుపుతున్నారు. ఇక కొద్ది రోజుల నుండి టాలీవుడ్ స్టార్ సింగర్ గీతా మాధురి, నటుడు నందు తమ రిలేషన్ షిప్‌కి బ్రేకప్ చెప్పుకున్నారని పుకార్లు వచ్చాయి. గీతా, నందుల మధ్య గొడవలు రావడం వల్ల గీత మాధురి తన పాపని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయిందని,నందు ఒక్కడే ఉంటున్నాడని, వీరిద్దరు ఏ ఈవెంట్‌లోను కలిసి కనిపించడం లేదని ఎన్నో ప్రచారాలు సాగాయి.
గీతా మాధురి, నందుల విడాకులకి సంబంధించి అనేక ప్రచారాలు సాగుతున్న నేపథ్యంలో తాజాగా నందు స్పందించారు. నందు ఇటీవల బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమాతో ఆడియన్స్ ని పలకరించినప్పటికీ ఈ సినిమా అంతగా అలరించలేకపోయింది. ఇక ఇప్పుడు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో మ్యాన్షన్ 24 అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా వరలక్ష్మి శరత్ కుమార్ తో కలిసి నందు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి వస్తున్న ప్రచారానికి చెక్ పెట్టాడు. గత రెండేళ్ల నుండి నేను గీత మాధురి విడాకులు తీసుకుంటున్నామంటూ ఎన్నో ప్రచారాలు సాగాయి. అయిన కూడా మేము క్లారిటీ ఇవ్వలేదు.
ఆ వార్తలు చదివి మేము నవ్వుకున్నాం. మేము ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోం. మేమిద్దరం విడాకులు తీసుకుంటున్నాం అని జరగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. మేము చాలా రోజుల నుండి రియాల్టీ షోలకి కూడా వెళ్లడం లేదు అంటూ నందు తన విడాకుల గురించి అందరికి ఓ క్లారిటీ ఇచ్చారు. ఇక మ్యాన్షన్ 24 సిరీస్ లో తన పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని, ఇప్పటివరకు తనని కేవలం సాఫ్ట్ అలాగే లవర్ బాయ్ రోల్స్ లోనే చూశారని, ఇందులో నెగటివ్ పాత్రలో చూస్తారని చెప్పుకొచ్చారు. కచ్చితంగా ఈ సిరీస్ మిమ్మల్ని ఆకట్టుకుంటుందని నందు చెప్పుకొచ్చారు