వారితో సంతోషం లేదు.. ప‌విత్ర‌తో జీవితం ఎలా ఉందో చెప్పిన న‌రేష్‌

వారితో సంతోషం లేదు.. ప‌విత్ర‌తో జీవితం ఎలా ఉందో చెప్పిన న‌రేష్‌

టాలీవుడ్‌కి చెందిన సీనియ‌ర్ న‌టుడు వి.కె.న‌రేష్ ఇటీవ‌ల కాలంలో ఎక్కువ‌గా వార్త‌ల్లో నిలుస్తున్న విష‌యం తెలిసిందే. అందుకు కార‌ణం ఆయ‌న ప‌విత్ర లోకేష్‌తో ఎక్కువ క‌నిపిస్తుండ‌డం.కెరీర్ ప్రారంభంలో ఎన్నో చిత్రాల్లో హీరోగా మెప్పించిన న‌రేష్‌ త‌ర్వాత క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు. కొన్నాళ్ల పాటు రాజ‌కీయాల్లోకి వెళ్లి రాణించే ప్ర‌య‌త్నం చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (MAA) అధ్య‌క్షుడిగా, కార్య‌ద‌ర్శిగానూ వ‌ర్క్ చేశారు. అయితే త‌న జీవితంకి సంబంధించిన విష‌యాల‌తో న‌రేష్ హాట్ టాపిక్ అవుతున్నాడు. ఆరు ప‌దులు వ‌య‌సు దాటిన సీనియర్ నరేష్ ఇప్ప‌టికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు.

నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి.. ఆయన పోకడపై పెద్ద గొడవే చేసింది. ఆ సమ‌యంలో న‌రేష్ మూడు పెళ్లిళ్ల క‌థేంట‌ని జ‌నాలు సెర్చ్ చేశారు.. సీనియ‌ర్ సినిమాటోగ్రాఫ‌ర్ శ్రీను కుమార్తెను ముందుగా వివాహం చేసుకున్నారు న‌రేష్ . వీరికి న‌వీన్ విజ‌య్ కృష్ణ అనే కొడుకు ఉన్నారు. అత‌ను హీరోగా రెండు, మూడు సినిమాల్లోనూ న‌టించారు.ఇక ఆమె నుండి విడిపోయాక ప్ర‌ముఖ ర‌చ‌యిత దేవుల‌ప‌ల్లి కృష్ణ‌శాస్త్రి మ‌న‌వ‌రాలు రేఖా సుప్రియ‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కొడుకు పుట్టారు. త‌ర్వాత ఈమెతోనూ న‌రేష్ మ‌న‌స్ప‌ర్ధ‌ల‌తో విడిపోయిన న‌రేష్‌.. కాంగ్రెస్ మాజీ మంత్రి ర‌ఘువీరా రెడ్డి సోద‌రుడి కుమార్తె అయిన ర‌మ్య ర‌ఘ‌ప‌తిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కొడుకు ఉన్నారు. ఆమెకి విడాకుల విష‌యంలో నోటీసులు పంపారు.

ఇక నరేష్, పవిత్రా లోకేష్ లు అన్ అఫీషియల్ గా పెళ్లి చేసుకున్నప్పటికీ.. దాన్ని అధికారికంగా ప్రకటించలేదు..వీరిద్దరి ఘాటు ప్రేమ గురించి పేపర్లు, టీవీలు, సోషల్ మీడియాలో ఎన్నో కథనాలు వచ్చాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ప‌విత్ర‌తో జీవితం ఎలా ఉందో చెప్పుకొచ్చాడు. దానికి ముందు ప‌లు లెక్క‌లు చెప్పాడు. ప్రపంచంలో సగం మంది విడాకులు తీసుకుంటున్నారని , అలాగే 70 నుంచి 80 శాతం మంది పెళ్లి జీవితంలో అనేక సమస్యలను ఎదరుక్కుంటున్నారని చెప్పాడు. అయితే అలాంటి వాళ్లంతా వేరు అయిపోయి ఎవరి జీవితాలను వాళ్లు లీడ్ చేసుకుంటున్నారని స్పష్టం చేశారు. మంచి, చెడు అనేది పక్కన పెడితో ఇద్దరికీ ఒకరికొకరు అంటే ఇష్టం ఉండాలని అదే చాలా ముఖ్యం అని చెప్పుకొచ్చారు. 40 ఏళ్ల తర్వాతే మనిషికి తోడు కావాలని ఈ సమయంలోనే కరెక్టుగా ఉన్న ఓ పార్టనర్ కావాలని నరేష్ తెలియ‌జేశారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న‌ప్పుడు సంతోషంగా లేను. ఇప్పుడు పవిత్రతో చాలా సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. మేమిద్దరం చాలా ప్రశాంతంగా, మిగిలిన జీవితాన్ని అంతా కలిసే జీవించాలని అనుకున్నాం అందుకే ఈ డిసీషన్ తీసుకున్నామంటూ నరేష్ వివరించారు.