ఇది నిజంగా షాకింగే.. ఓటీటీలో వచ్చే అడల్డ్ సినిమాలకు సెన్సార్ నిబంధనలు

ప్రస్తుతం ఓటీటీ హవా ఏ రేంజ్లో ఉందో మనం చూస్తూనే ఉన్నాం. కోవిడ్ సమయంలో ఓటీటీలకి మంచి ఆదరణ దక్కింది. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌తో పాటు పలు సంస్థలకి చాలానే డిమాండ్ పెరిగింది. ఈ ఓటీటీ ప్లాట్‌ఫాంలలో వైవిధ్యమైన కంటెంట్ ప్రసారం అవుతున్న నేపథ్యంలో వాటికి రోజురోజుకి ఆదరణ పెరుగుతూ పోతుంది. అయితే ఓటీటీ ప్లాట్‌ఫాంలలో ప్రసారం అయ్యే సినిమాలకి సెన్సార్ వారు ఇప్పటి వరకు ఎలాంటి అభ్యంతరం తెలపలేదు. కాని ఇప్పటి నుండి మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. ఇప్పటి నుండి మాత్రం అన్ కట్, అన్ ఎడిటెడ్ వెర్షన్స్ అంటూ సినిమాలు, వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి.
ఓటీటీ మూవీస్, సిరీస్ లకు ఇప్పటి నుండి సెన్సార్ ఉండనుంది. ఓటీటీ సినిమాలు, సిరీస్‌లోని అసభ్యకర సన్నివేశాలు, డైలాగులపై సెన్సార్ నిబంధనలు విధించింది కేంద్రం. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ దానిని ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. రీసెంట్గా భీద్ అనే సినిమా స్ట్రీమింగ్కి రాగా, ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఇతర రాజకీయ నేతల ప్రస్తావన ఉండడంతో ఆ సీన్లను పూర్తిగా కత్తిరించేశారు. లియో’, ‘ఓఎంజీ 2’ సినిమాలలో కూడా కొన్ని సన్నివేశాలని కట్ చేసి ప్రసారం చేస్తున్నారు. కొత్త నోటీసు ప్రకారం, నెట్‌ఫ్లిక్స్ సెన్సార్ చేసిన వెర్షన్‌ను స్ట్రీమింగ్ చేస్తుండడం యువతకి కాస్త ఇబ్బంది కలిగే విషయమే .
త్వరలో సలార్, యానిమల్ చిత్రాలు ఓటీటీలోకి రానుండగా, వాటిలో ఎన్ని సన్నివేశాలని సెన్సార్ చేస్తారో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. యానిమల్ సినిమా మొత్తం 4 గంటలకు పైగా ఉండగా, థియేటర్లో మూడు గంటల పాటు మాత్రమే రిలీజ్ చేశారు. ఓటీటీలో ఫుల్ కంటెంట్ వస్తుందని అభిమానులు భావించగా, వారికి నెట్‌ఫ్లిక్స్ పెద్ద షాక్ ఇచ్చేలా కనిపిస్తుంది. కాగా, కేవలం థియేట్రికల్ రిలీజ్ సినిమాల వరకు ఇండియన్ సెన్సార్ రూల్స్ ప్రకారమే సెన్సార్ చేసిన వర్షన్స్ మాత్రమే తమ ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తామని నెట్ ఫ్లిక్స్ చెప్పుకు వచ్చింది.