NIAకు సుప్రీంలో చుక్కెదురు!
విధాత: భీమా కోరేగాం కేసులో ఆనంద్ టెల్‌తుమ్డెకు ముంబాయి హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలంటూ సుప్రీం మెట్లు ఎక్కిన ఎన్ ఐఏకు చుక్కెదురైంది. ఆయనకు హై కోర్టు ఇచ్చిన బెయిల్‌కు సకారణాలున్నాయని తెలిపి, ఎన్ ఐఏ పెట్టుకున్న బెయిల్ రద్దు పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నాయన్నఆరోపణతో ప్రొఫెసర్ టెల్‌తుమ్డెను 2020 ఏప్రిల్ 14న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐఏ) అరెస్టు చేసింది. ఆయనతో పాటు దేశవ్యాప్తంగా మేధావులు, రచయితలు […]

విధాత: భీమా కోరేగాం కేసులో ఆనంద్ టెల్‌తుమ్డెకు ముంబాయి హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలంటూ సుప్రీం మెట్లు ఎక్కిన ఎన్ ఐఏకు చుక్కెదురైంది. ఆయనకు హై కోర్టు ఇచ్చిన బెయిల్‌కు సకారణాలున్నాయని తెలిపి, ఎన్ ఐఏ పెట్టుకున్న బెయిల్ రద్దు పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.
మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నాయన్నఆరోపణతో ప్రొఫెసర్ టెల్‌తుమ్డెను 2020 ఏప్రిల్ 14న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐఏ) అరెస్టు చేసింది. ఆయనతో పాటు దేశవ్యాప్తంగా మేధావులు, రచయితలు 14 మందిని NIA అరెస్టు చేసింది. గత రెండేండ్లుగా వీరంతా జైళ్లలోనే మగ్గుతున్నారు. ఈ జైలు నిర్బంధంలోనే సరైన వైద్య సదుపాయాలు అందక స్టాన్ స్వామి లాంటి సామాజిక ఉద్యమకారుడు మరణించారు.
ప్రముఖ విప్లవ రచయిత వరవరరావు వైద్య ఆరోగ్య కారణాలతో బెయిల్ పొంది ముంబాయిలో గృహ నిర్బంధంలో ఉన్నారు. రెండేండ్ల తర్వాత మేథావి, రచయిత, దళిత సామాజిక ఉద్యమకారుడు టెల్ తుమ్డెకు బెయిల్ లభించటం పెద్ద ఊరటగా భావించవచ్చు.