ప‌వ‌న్ క‌ళ్యాణ్-సౌందర్య కాంబినేష‌న్‌లో సినిమా.. అస‌లు అలా ఎలా మిస్ అయింది.!

ప‌వ‌న్ క‌ళ్యాణ్-సౌందర్య కాంబినేష‌న్‌లో సినిమా.. అస‌లు అలా ఎలా మిస్ అయింది.!

టాలీవుడ్‌లో కొన్ని క్రేజీ కాంబినేష‌న్స్ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రిస్తూ ఉంటాయి. ఆ కాంబినేష‌న్స్ మంచి మ‌జా అందిస్తుంటాయి. అయితే సెట్ కాని కొన్ని కాంబోలు ఊరిస్తుంటాయి. ఆ ఇద్ద‌రి కాంబోలో సినిమా వ‌స్తే చూడాల‌ని ప్రేక్ష‌కులు ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తూ ఉంటారు. అలా ప‌వ‌న్ క‌ళ్యాణ్, సౌంద‌ర్య కాంబోలో సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆశ‌గా ఎదురు చూశారు. అయితే కొన్ని కార‌ణాల వ‌ల‌న ఆ కాంబో మిస్ అయింది. చిరంజీవి త‌మ్ముడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న మూడో సినిమ‌గా సుస్వాగ‌తం చేశాడు. ఈ చిత్రం భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొంద‌గా, ఈ మూవీ పెద్ద హిట్ అయింది.

చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జోడిగా సీనియర్ హీరోయిన్ దేవయాని నటించిన విషయం తెలిసిందే. అయితే ఆమె కంటే ముందు ఈ సినిమాలో హీరోయిన్ గా సౌందర్య‌ని అనుకున్నార‌ట‌. కాని పవన్ ఒప్పుకోలేదట. అంత గొప్ప నటితో నటించే ధైర్యం నాకు లేదని,. ఆమె నటన ముందు నా నటన తేలిపోతుంద‌ని.. ఆమె బదులు వేరే హీరోయిన్ ను తీసుకోమని దర్శక నిర్మాతలను కోరారట ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. అప్పటికే సౌందర్య ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగుతోపాటు తమిళంలో స్టార్ హీరోలకు జోడిగా నటిస్తూ దూసుకుపోతున్న స‌మ‌యంలో సౌంద‌ర్య‌తో న‌టించేందుకు ప‌వ‌న్ ఆస‌క్తి చూప‌లేదు.

దాంతో దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు దేవయానిని తీసుకుని సుస్వాగతం సినిమాను తెరకెక్కించారు.ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ మూవీ ఆ రోజుల్లోనే ఫుల్ రన్ లో ఏకంగా రూ.6 కోట్లకు పైగా వసూలు రాబట్టి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. కాక‌పోతే పవన్ కళ్యాణ్, సౌందర్య కాంబినేషన్లో రావాల్సిన బ్లాక్ బస్టర్ సినిమా మిస్ అయిపోయింది అని అభిమానులు ముచ్చ‌టించుకుంటున్నారు. నిజంగా ఈ సినిమా వచ్చి ఉంటే పవన్ కళ్యాణ్, సౌందర్య కెరీర్ లోనే ఎప్పటికీ మర్చిపోలేని హిట్ గా టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో నిలిచిపోయి ఉండేద‌ని మెగా ఫ్యాన్స్ అంటున్నారు.