మధుయాష్కీ ఇంటిపై అర్ధరాత్రి పోలీసుల దాడులు.. హయత్‌నగర్‌లో టెన్షన్

హైదరాబాద్ : హయత్‌నగర్‌లో మంగళవారం అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎల్‌బీనగర్ నియోజకవర్గంలో బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ ఇంటిపై అర్ధరాత్రి పోలీసుల దాడులు నిర్వహించారు. అనుమతి లేకుండానే పోలీసులు మధుయాష్కీ ఇంట్లోకి చొరబడి అత్యుత్సాహం ప్రదర్శించారు. సోదాల పేరుతో కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురిచేశారు. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా మధుయాష్కీ ఇంట్లో సోదాలు చేయడంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఓటమి భయంతోనే బిఆర్ఎస్ మరియు బిజెపి కలసి ఇటువంటి కుట్రలకు పాల్పడుతున్నారని మధు యాష్కీ నిప్పులు చెరిగారు. ఇటువంటి దాడులకు భయపడేది లేదని, పోలీసులపై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.