భర్తతో తెగ రొమాన్స్ చేస్తున్నజెనీలియా.. అది చూడలేక ముఖం తిప్పుకొని పక్కనుండి వెళ్లిన పూజా హెగ్డే

బుట్టబొమ్మ పూజా హెగ్డే కొన్నేళ్ల క్రితం వరకు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది. వరుస హిట్స్‌తో దుమ్ము లేపింది. అయితే ఇప్పుడు ఆమె పరిస్థితి దారుణంగా ఉంది. అవకాశాలు లేక హిట్స్ అందక సోషల్ మీడియాలో మాత్రం దుమ్ము రేపుతుంది. గ్లామర్ షోతో కేక పెట్టిస్తుంది. అయితే పూజా హెగ్డే పెళ్లి చేసుకుంటే బెటర్ అని కొందరు సలహాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ అమ్మడు సింగిల్‌గా ఉండగా, ప్రేమాయణం నడుపుతున్నట్టు కూడా ఎలాంటి లీక్‌లు బయటకి రాలేదు. అడపాదడపా ఆమెపై రూమర్స్ వచ్చినా, వాటిపై పూజా హెగ్డే స్పందించింది లేదు. అయితే తాజాగా పూజా హెగ్డే ఓ కపుల్ రొమాన్స్ చూసి చాలా జెలస్ ఫీలైంది.
ముంబయిలో జరిగిన ఓ ఈవెంట్‌లో జెనీలియా, రితేష్ దేశ్ ముఖ్‌లు పాల్గొన్నారు. ఈ ఇద్దరు కలిసి రెడ్ కార్పెట్‌పై వాక్ చేయడానికి రెడీగా ఉన్న సమయంలో జెనీలియా, రితేష్ సరదాగా నవ్వుతూ, చిలిపిగా అల్లరి చేసుకుంటూ కెమెరాలకి చిక్కారు. ఇక ఫోటో షూట్ మధ్యలో కూడా ఇద్దరు ఇలా రొమాంటిక్‌గా బిహేవ్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే ఆ సమయంలో పూజా హెగ్డే పక్క నుండి నడుచుకుంటూ వచ్చింది. వీరిని చూసి కాస్త జెలస్‌గా ఫీలైంది. వెరైటీ ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ పూజా హెగ్డే నడుచుకుంటూ వస్తున్న వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ జెనీలియా, రితేష్ ని చూసి పూజా జెలస్ ఫీలవుతుందని అంటున్నారు.
వీడియాపై మీమ్స్ పేలుతున్నాయి. పాపం పూజా సింగిల్ కష్టాలు ఇంకెన్నాళ్లు, మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకో అంటూ కొందరు సలహాలు ఇస్తున్నారు. ఇక పూజా హెగ్డే కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం హిందీలో `దేవా` చిత్రం చేస్తుంది. ఈ మూవీతోపాటు మరికొన్ని సినిమాలకు సైన్ చేసేందుకు ఈ ముద్దుగుమ్మ రెడీ అయినట్టు టాక్.. `గుంటూరు కారం` లో ముందుగా పూజాని ఎంపిక చేసిన పలు కారణాల వలన ఆమెని తప్పించారు. పవన్ కళ్యాణ్ `ఉస్తాద్ భగత్ సింగ్` నుంచి కూడా పూజా హెగ్డేని తప్పించినట్టు టాక్. ఇక సాయిధరమ్ తేజ్‌తో చేయాల్సిన `గంజాశంకర్` ఆగిపోయింది. దీంతో పూజా హెగ్డే కెరీర్ అగమ్యగోచరంగా మారింది.
Singles While Seeing the Couples ✅#PoojaHegde