పూన‌మ్ పాండేకి ఏ క్యాన్స‌ర్ వ‌చ్చింది.. ఆమె మృతికి అస‌లు కార‌ణం ఏంటో తెలిస్తే అవాక్క‌వుతారు..!

  • By: sn    breaking    Feb 02, 2024 10:40 AM IST
పూన‌మ్ పాండేకి ఏ క్యాన్స‌ర్ వ‌చ్చింది.. ఆమె మృతికి అస‌లు కార‌ణం ఏంటో తెలిస్తే అవాక్క‌వుతారు..!

చిన్న వ‌య‌స్సులో త‌నువు చాలించి అంద‌రిని షాక్‌కి గురి చేసిన బోల్డ్ బ్యూటీ పూన‌మ్ పాండే. కేవలం 32 ఏళ్లకే ఈ లోకాన్ని విడిచిపెట్టిన పూనమ్ పాండే గురించే సర్వత్రా చర్చలు మొదలయ్యాయి. ఆమె మరణంతో పూనమ్ గురించి అంద‌రు సెర్చింగ్ మొద‌లు పెట్టారు. ఈ అమ్మ‌డు ఎప్ప‌టిక‌ప్పుడు బోల్డ్ ఫొటోలు షేర్ చేస్తూ నిత్యం వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది. నటిగా అనేక చిత్రాల్లో నటించిన పూనమ్ ఆ తర్వాత అశ్లీల చిత్రాల్లో సైతం నటించింది. సొంతంగా యాప్ ప్రారంభించి అందులో అశ్లీల చిత్రాలు అప్‌డేట్ చేస్తూ తెగ ర‌చ్చ చేసింది. 2011లో టీంఇండియా వరల్డ్ కప్ వెలిస్తే నగ్నంగా వారి ముందు డ్యాన్స్ చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చి దేశం మొత్తం త‌న‌పై దృష్టి ప‌డేలా చేసుకుంది.

ఇలా పూన‌మ్ కెరీర్‌లో ఎన్నో వివాదాస్ప‌ద అంశాలు ఉన్నాయి.పూనమ్‌కి లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ముంబైలోని ఒక నాగరిక ప్రాంతంలో కూడా నివ‌సించిన ఈమె తను రూపొందించిన యాప్ ద్వారా కూడా బోలెడంత ఆదాయాన్ని ఆర్జించింది. అయితే పూన‌మ్ ఇంత చిన్న వ‌య‌స్సులో మృతి చెంద‌డాన్ని ఎవ‌రు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఆమె సెర్వికల్ క్యాన్సర్ తో మరణించినట్లు ఆమె టీం ప్రకటించింది. దీనితో అసలు సెర్వికల్ క్యాన్సర్ అంటే ఏంటి ? పూనమ్ ఎందుకు మరణించారు అనే దానిపై అభిమానులు శోధ‌న జ‌రుపుతున్నారు. సెర్వికల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆడవారిలో వచ్చే ఈ క్యాన్సర్ 30 నుంచి 45 ఏళ్ల వయసుగలవారికి ప్రధానంగా వ‌స్తుంద‌ని, సెక్సువల్ ఇన్ఫెక్షన్స్ దీనికి ప్ర‌ధాన కార‌ణం అని స్ప‌ష్టం చేస్తున్నారు.

ఈ క్యాన్సర్ కి కారణమయ్యే హ్యూమన్ పాపిలోమా వైరస్ సెక్సువల్ గా ట్రాన్స్మిట్ అవుతుందట. మల్టిపుల్ సెక్సువల్ పార్ట్నర్స్ ని కలిగి ఉండడం.. తక్కువ ఏజ్ నుంచే సెక్సువల్ యాక్టివిటీ ఉండడం వ‌ల‌న ఈ క్యాన్స‌ర్ సోకే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని అంటున్నారు. పార్ట్నర్ కి ఇన్ఫెక్షన్స్ ఉండ‌డంతో పాటు, మల్టిపుల్ ప్రెగ్నన్సీ , ఇమ్మ్యూనిటీ తక్కువ ఉన్నవారికి కూడా ఈ క్యాన్సర్ రిస్క్ ఉంటుందట. అయితే ఈ క్యాన్స‌ర్‌ని పూన‌మ్ స్టార్టింగ్ స్టేజ్‌లో గుర్తించి ఉంటే ఇంత వ‌ర‌కు వ‌చ్చేది కాద‌ని, ఆమె అంత‌ట ఆమె త‌న ప్రాణాల మీద‌కి తెచ్చుకుంద‌ని కొంద‌రు చెప్పుకొస్తున్నారు