టీమిండియా ప్లేయ‌ర్స్ అంద‌రు తాగుబోతులే.. ప్ర‌వీణ్ కుమార్ అలా అనేశాడేంటి..!

టీమిండియా ప్లేయ‌ర్స్ అంద‌రు తాగుబోతులే.. ప్ర‌వీణ్ కుమార్ అలా అనేశాడేంటి..!

టీమిండియా బౌల‌ర్స్‌లో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చి 2000వ సంవ‌త్స‌రంలో స్టార్ బౌల‌ర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్ర‌వీణ్ కుమార్. 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ప్రవీణ్ కుమార్.. 2012లో చివరి మ్యాచ్ ఆడాడు. భారత్ తరఫున 6 టెస్ట్‌లు, 68 వన్డేలు, 10 టీ20లు ఆడిన ఇత‌గాడు మూడు ఫార్మాట్లలో కలిపి 122 వికెట్లు తీసాడు. ఐపీఎల్‌లో 119 మ్యాచ్‌లు ఆడాడు. ఈ క్ర‌మంలో అతను 90 వికెట్లు పడగొట్టాడు. 2017లో చివరగా ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ లయన్స్ ఫ్రాంచైజీల‌కు ప్రాతినిథ్యం వహించిన ప్ర‌వీణ్ కుమార్ ఓ ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న కామెంట్స్ చేసి వార్త‌ల‌లో నిలిచాడు.

ప్రవీణ్ కుమార్ తాజాగా ఎంఎస్ ధోనీ, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ వంటి క్రికెటర్లపై తీవ్ర ఆరోపణలు చేస్తూ వార్త‌ల‌లోకి ఎక్కాడు. కెరీర్ మధ్యలోనే భారత జట్టుకు దూరమైన ప్రవీణ్ కుమార్ ఆ తర్వాత జాతీయ జట్టులోకి పునరాగమనం చేయలేకపోయాడు. అయితే, దీనికి కార‌ణం మైదానంలో అతని పేలవమైన ప్రదర్శన కాదనీ, మద్యపానంతో సహా అతని చెడు అలవాట్లు అతని ప్ర‌యాణానికి అడ్డుప‌డ్డాయ‌ని ప్ర‌చారాలు సాగాయి. దానిపై తాజాగా స్పందించిన ఆయ‌న భార‌త జ‌ట్టులో ప్ర‌తి ఒక్క‌రు తాగుతారు, కాని చివ‌రికి న‌న్నే నిందిస్తారు. సీనియ‌ర్ ఆట‌గాళ్ల‌తో స‌హ అందరు కూడా న‌న్ను నిందించ‌డం వంటివి చేస్తారు, కాని అందరు తాగేవాళ్లే. కాని నాకే తాగుబోతు అనే పేరు తీసుకొచ్చారు అని పేర్కొన్నాడు.

అప్పుడు మీకు సచిన్, ద్రవిడ్, గంగూలీ వంటి వారు స‌ల‌హాలు ఇచ్చారా అని ప్రశ్నించాగా .. కెమెరా ముందు ఎవరి పేరునూ ప్రస్తావించదలుచుకోలేదనీ, అందరికీ తెలుసని ప్రవీణ్ కుమార్ సమాధానమిచ్చారు. ఇక అరంగేట్ర ఐపీఎల్ సీజన్‌లో ఆర్‌సీబీకి బదులు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతానని చెప్పినందుకు లలిత్ మోడీ బెదిరించారని గుర్తు చేసుకున్నాడు. ఒప్పందం ప్రకారం ఆర్‌సీబీకి ఆడకపోతే.. కెరీర్ నాశనం చేస్తానని బెదిరించాడు.’అని ప్రవీణ్ కుమార్ తాజాగా అప్ప‌టి విష‌యాల‌ని గుర్తు చేసుకుంటూ హాట్ టాపిక్‌గా నిలిచాడు.