గుర్తు ప‌ట్ట‌కుండా మారిపోయిన పూరీ జ‌గ‌న్నాథ్‌..ఛార్మి రియాక్ష‌న్ ఏంటంటే..!

  • By: sn    breaking    Nov 03, 2023 11:57 AM IST
గుర్తు ప‌ట్ట‌కుండా మారిపోయిన పూరీ జ‌గ‌న్నాథ్‌..ఛార్మి రియాక్ష‌న్ ఏంటంటే..!

డాషింగ్ డైరెక్టర్ పూరీ జ‌గ‌న్నాథ్ త‌న కెరీర్‌లో ఎన్నో మంచి సినిమాలు తీసి స‌త్తా చాటాడు. పవన్ కల్యాణ్ హీరోగా 2000 సంవత్సరంలో బద్రి సినిమాతో కెరియర్ ప్రారంభించిన పూరీ జ‌గ‌న్నాథ్ త‌క్కువ స‌మ‌యంలోనే టాప్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు. పూరీ సినిమాల‌లో త‌న మార్క్ క‌నిపించ‌డంతో పాటు ప్రేక్ష‌కులు మెచ్చే అంశాలు చాలానే ఉంటాయి. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి, ఆంధ్రావాలా, 143, సూపర్, పోకిరి, దేశముదురు, హలో ప్రేమిస్తారా, చిరుత, బుజ్జిగాడు, నేనింతే, ఏక్ నిరంజన్, గోలీమార్, నేను నా రాక్షసి, బిజినేస్ మేన్, కెమెరా మాన్ గంగతో రాంబాబు, ఇద్దరమ్మాయిలతో, లోఫర్, హార్ట్ ఎటాక్, టెంపర్ వంటి సూప‌ర్ హిట్ చిత్రాలు పూరీ ఖాతాలో ఉన్నాయి.

అయితే ఇటీవ‌ల పూరీ స‌క్సెస్ రేటు అంత‌గా లేదు. ఒక హిట్ కొడితే నాలుగు ఫ్లాపులు తీస్తున్నాడు. చివ‌రిగా లైగ‌ర్ అనే చిత్రం చేశాడు. ఈ మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దారుణమైన ఫ్లాప్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమాతో త్వ‌ర‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే ప్రారంభం కాగా, సినిమాని ఒళ్లు ద‌గ్గ‌ర‌పెట్టుకొని రూపొందిస్తున్న‌ట్టు తెలుస్తుంది.ఈ సినిమా కోసం రామ్ పూర్తిగా ఇస్మార్ట్ లుక్‌లోకి మారిపోయాడు. చివ‌రిగా రామ్ న‌టించిన స్కంద చిత్రం పెద్ద‌గా అల‌రించ‌క‌పోవ‌డంతో డ‌బుల్ ఇస్మార్ట్‌పై భారీ హోప్స్ పెట్టుకున్నాడు. ఇటు రామ్‌కి, అటు పూరీకి డబుల్ ఇస్మార్డ్ శంక‌ర్ చిత్ర విజ‌యం చాలా ముఖ్యం.

అయితే పూరి డబుల్ ఇస్మార్ట్ యాక్షన్ సీన్ల షూట్‌లో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతున్న స‌మ‌యంలో పూరీ జ‌గ‌న్నాథ్ స్ట‌న్నింగ్ లుక్‌లో క‌నిపించి అంద‌రికి షాక్ ఇచ్చాడు. పూరీ జ‌గ‌న్నాథ్ గుండు కొట్టించుకున్న ఫొటోని ఛార్మి త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. వెనకాల ఉన్న ఉదయించే సూర్యుడితో పూరిని పోల్చుతూ కామెంట్ చేయ‌గా, ప్ర‌స్తుతుం పూరీ ఫొటో నెట్టింట తెగ హ‌ల్చ‌ల్ చేస్తుంది. ఇక పూరీ లుక్ చూసి ప్ర‌తి ఒక్కరు ఆస‌క్తిక‌ర కామెంట్స్ పెడుతున్నారు. ప్ర‌స్తుతం పూరీ లుక్ నెట్టింట వైర‌ల్‌గా మారింది.