ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకున్న రాహుల్, ప్రియాంక గాంధీలు
ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకున్న రాహుల్, ప్రియాంక గాంధీలు


ALSO READ : Chahal-Dhanashree Divorced: విడాకులు తీసుకున్న.. క్రికెటర్ చాహల్, ధనశ్రీ వర్మ! భరణం ఎన్ని కోట్లంటే?
విధాత, ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు బుధవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. ములుగు నియోజక వర్గం నుంచి ప్రారంభం కానున్నా బస్సు యాత్రలో పాల్గొనడానికి వచ్చిన రాహుల్, ప్రియాంకలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంజన్ కుమార్ యాదవ్, టి. సుబ్బిరామిరెడ్డి, రేణుక చౌదరీ, షబ్బీర్ అలీ, కోదండరెడ్డి, నిరంజన్, అనిల్ యాదవ్, హర్కర వేణుగోపాల్, సమీరుల్లా, ఫేహెం ఖురేషి, ఫేహీం, మెట్టు సాయి కుమార్ తదితరులు స్వాగతం పలికారు.