ఈ మధ్య రాజీవ్ కనకాల ఎందుకంత లావుగా కనిపిస్తున్నాడు.. బయటపడ్డ అసలు నిజం..!

నటుడు, యాంకర్ సుమ భర్త రాజీవ్ కనకాల గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. టీవీ రంగంలో కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత బిగ్ స్క్రీన్‌పై నాన్ స్టాప్‌గా సినిమాలు చేశారు రాజీవ్. రాంబంటు సినిమాతో మొదలైన ఆయన ప్రయాణం స్టూడెంట్ నంబర్ 1, ఆది, నువ్వే నువ్వే, నాగ, ఫిల్మ్ బై అరవింద్, మీనాక్షి, యమదొంగ, సరిలేరు నీకెవ్వరు, లాంటి పెద్ద పెద్ద సినిమాల్లో స్టార్ హీరోలతో కూడా నటించారు. అయితే ఒకప్పుడు సినిమాలతో చాలా బిజీగా ఉండే రాజీవ్ కనకాల ఈ మధ్య మాత్రం అడపాదడపా మాత్రమే కనిపిస్తున్నాడు. అయితే రాజీవ్ ఈ మధ్య పలు ఈవెంట్స్‌లో కనిపిస్తుండగా, గతంలో కన్నా చాలా లావుగా కనిపిస్తూ అందరు షాకయ్యేలా చేశారు.
రాజీవ్ కనకాల సడెన్‌గా అంత లావు కావడంతో వారి అభిమానులలో అనేక అనుమానాలు మొదలయ్యాయి. అసలు రాజీవ్ కి ఏమైందని ఆరా తీసే పనిలో ఉన్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే రాజీవ్ కనకాల తాను లావు కావడం గురించి క్లారిటీ ఇచ్చారు. ఆ మధ్య ఫుడ్ పాయిజన్ అయ్యిందని, ఆసుపత్రిలో జాయిన్ అయ్యాక సెలైన్స్, యాంటిబయాటిక్స్ ఇచ్చారని అన్నాడు. ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఆసుపత్రిలో ఇచ్చిన ఫుడ్.. ఇంటి నుండి వచ్చిన ఫుడ్ కూడా తినేసేవారట. ఇక ఇంటికి వచ్చాక కూడా రోజూ స్వీట్స్ తినాలనిపించి రోజూ అరకిలో స్వీట్స్ తిన్నాడట. దాంతో సడెన్‌గా బరువు పెరిగిపోయారట. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంలో వరంగల్‌లో క్రికెట్ ఆడుతుండగా కాలు బెణికి నడవలేకపోయారట. ప్రస్తుతం బరువు తగ్గడానికి చాలా ప్రయత్నిస్తున్నారని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చాడు.
మొత్తానికి రాజీవ్ కనకాల అంత లావు కావడం వెనక ఉన్న సీక్రెట్ బయటపడింది. రాజీవ్ ప్రస్తుతం రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీలో నటిస్తున్నారు. అలానే పలు చిత్రాలలోను కీలక పాత్రలు పోషిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా రాజీవ్-సుమ దంపతుల కొడుకు రోషన్ కూడా ‘బబుల్ గమ్’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. తన కొడుక్కి మంచి హిట్ అందించాలని సుమ, రాజీవ్ చాలా ప్రయత్నించిన కూడా అది అంత వర్కవుట్ కాలేదు.