ప‌వ‌న్ క‌న్నా చాలా సింప్లిసిటీ.. ఒక్క ష‌ర్ట్‌ని 8 ఏళ్లుగా వాడుతున్న రామ్ చ‌ర‌ణ్‌

ప‌వ‌న్ క‌న్నా చాలా సింప్లిసిటీ.. ఒక్క ష‌ర్ట్‌ని 8 ఏళ్లుగా వాడుతున్న రామ్ చ‌ర‌ణ్‌

చిరంజీవి త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చ‌ర‌ణ్ ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు.ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ఇప్పుడు తమిళ దర్శకుడు శంకర్‌తో గేమ్ ఛేంజర్ అనే ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే… ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా గత కొన్ని రోజులుగా రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రం లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక రామ్ చ‌ర‌ణ్ తన 16వ సినిమాను ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో చేయ‌నున్న విష‌యం తెలిసిందే.

ఈ చిత్రంలో కీలక పాత్రలో హిందీ హీరో టైగర్ ష్రాఫ్ నటించనుండని తెలుస్తోంది. టైగర్ ష్రాఫ్ ఈ సినిమాలో విలన్‌గా కనిపించనున్నారట. ఇక ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా నటిస్తున్నట్లు స‌మాచారం. ఇక ఇదిలా ఉంటే రామ్ చ‌ర‌ణ్‌కి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధార‌ణంగా రామ్ చ‌ర‌ణ్ చాలా సింపుల్‌గా ఉంటారు. సినిమాల‌లో త‌ప్ప బ‌య‌ట చాలా సింప్లిసిటీ మెయింటైన్ చేస్తారు.వ‌రుణ్ తేజ్ పెళ్లి రాయల్ ప్యాలస్ లో గ్రాండ్ గా జ‌ర‌గ‌గా, ఆ పెళ్ళిలో ప్రతి ఒక్కరు రాయల్ వెడ్డింగ్ కి తగ్గట్టు డ్రెస్సింగ్ చేసుకుంటే.. రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ మాత్రం చాలా సింపుల్ గా కనిపించారు. ఇది చూసి అంద‌రు బాబాయ్ మాదిరిగానే అబ్బాయి అని కామెంట్ చేశారు.

ఇక రామ్ చ‌ర‌ణ్ ఓ ష‌ర్ట్ ఇప్పుడు అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. రీసెంట్ గా రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి దిగిన ఫోటో ఒకటి బయటకి రాగా, ఇందులో గ్రీన్ గ్రే కలర్ చెక్ షర్ట్ వేసుకొని కనిపించారు రామ్ చ‌ర‌ణ్ . 2016లో ధృవ సినిమాలో అదే షర్ట్ ని రామ్ చరణ్ వేసుకుని కనిపించారు. ఆ తరువాత మరోసారి ఆర్ఆర్ఆర్ షూటింగ్ జరుగుతున్న సమయంలో.. ఈసినిమా ప్రమోషన్స్ టైమ్ లో కూడా చరణ్ ఈషర్ట్ లో కనిపించారు. అంతే కాదు పలు సందర్భాల్లో చరణ్ ఈ ష‌ర్ట్‌ని ఎక్కువ‌గా వేసుకొని ప‌వ‌న్ క‌న్నా చాలా సింప్లిసిటీ.. ఒక్క ష‌ర్ట్‌ని 8 ఏళ్లుగా వాడుతున్న రామ్ చ‌ర‌ణ్‌క‌నిపించారు. ఇది సెంటిమెంటా లేక సింప్లిసిటీలో భాగంగా రామ్ చ‌ర‌ణ్ ఇలా వేసుకుంటున్నాడా అని ప‌లువురు ముచ్చిటించుకుంటున్నారు.