ర‌వితేజ స‌రికొత్త బిజినెస్ ప్లానింగ్.. అల్లు అర్జున్,మ‌హేష్ బాబుకి పోటీగా..!

ర‌వితేజ స‌రికొత్త బిజినెస్ ప్లానింగ్.. అల్లు అర్జున్,మ‌హేష్ బాబుకి పోటీగా..!

సినిమా రంగంలో ఉన్న‌వారు కూడా ఇప్పుడు బిజినెస్‌ల‌పై ప్ర‌త్యేక దృష్టి పెడుతున్నారు. సినిమాల‌తో బాగానే సంపాదిస్తున్నా కూడా వ్యాపారంపై ప్ర‌త్యేక ఫోక‌స్ పెట్టి నాలుగు రాళ్లు వెన‌కేసుకోవాల‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో చాలా మంది స్టార్ హీరోలు థియేట‌ర్ బిజినెస్‌పై దృష్టి పెడుతున్నారు. ఇప్ప‌టికే ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ ని స్థాపించిన విష‌యం మనంద‌రికి తెలిసిందే. ఇప్పుడు ఏఎంబీ సినిమాస్ అద్భుతంగా ర‌న్ అవుతూ భారీ లాభాల‌ని కూడా తెచ్చిపెడుతుంది. ఇక మ‌హేష్ బాబు త‌ర్వాత అల్లు అర్జున్ కూడా ఏషియన్ సినిమాస్‌తో క‌లిసి ఏఏఏ సినిమాస్ అంటూ మల్టిఫ్లెక్స్ ని ప్రారంభించారు.

గత ఏడాది ఈ మల్టిఫ్లెక్స్ ప్రారంభం కాగా, దీనికి మంచి ఆద‌ర‌ణ ద‌క్కుతుంది. ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా త‌న సొంత ఊరులో ఒక థియేట‌ర్ ప్రారంభించాడు. ఇప్పుడు ర‌వితేజ వంతు వ‌చ్చింది. ఆయ‌న కూడా మ‌ల్టీ ప్లెక్స్ బిజినెస్ మొద‌లు పెట్ట‌బోతున్న‌ట్టు ఓ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో దిల్ షుక్ నగర్ లో భారీ మల్టీ ఫ్లెక్స్ నిర్మాణం చేపట్టబోతున్నార‌ని ఫిలిం న‌గ‌ర్‌లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. 6 స్క్రీన్స్ తో ఈ మల్టీ ఫ్లెక్స్ ని నిర్మిస్తున్నారట. ఈ మల్టీ ఫ్లెక్స్ కి ART అని నామకరణం చేయ‌నున్నాడ‌ని టాక్ న‌డుస్తుంది. రానున్న రోజుల‌లో ఈ థియేట‌ర్ నిర్మాణం పూర్తై అంద‌రిని ఆకర్షిస్తుంద‌ని భావిస్తున్నారు.

ఇక ర‌వితేజ ఇటీవ‌ల పెద్ద‌గా స‌క్సెస్‌లు చూడ‌డం లేదు. ఏ సినిమా చేసిన కూడా ఆ సినిమాకి నెగెటివ్ ఫ‌లితం వ‌స్తుంది. ధమాకా తర్వాత ఈ మాస్ మహారాజ్ కి సరైన హిట్ లేదు. చివరగా రిలీజ్ అయిన‌ ఈగల్ మూవీ కూడా నిరాశపరిచింది. ఈ సినిమాకు టాక్ బాగానే వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం దెబ్బ‌కొట్టాయి. సెకండాఫ్ బాగుందని.. టీం ఇంకాస్త ప్రమోట్ చేసుకుని ఉంటే మూవీ సేఫ్ జోన్‌లో ఉండేది. వరస ఫ్లాపులు వస్తున్నా కూడా రవితేజ కోసం దర్శకులు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం హరీశ్‌ శంకర్‌తో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్న ర‌వితేజ ఈ మూవీతో మంచి హిట్ కొట్టాల‌ని భావిస్తున్నాడు.