మునుగోడు: ఫలితాల వెల్లడి అనుమానాస్పదంగా ఉంది: బండి సంజయ్‌

విధాత: మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల వెల్లడిలో సీఈవో తీరుపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫలితాల వెల్లడిలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వైఖరి అనుమానాస్పదంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. టీఆర్ఎస్‌కు లీడ్ వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను అప్ డేట్ చేయడంలేదని అన్నారు. బీజేపీ లీడ్ వచ్చినప్పటికీ వాటి ఫలితాలను వెల్లడించడం లేదని,  మొదటి, రెండు రౌండ్ల తరువాత మూడు, నాలుగు రౌండ్ల […]

మునుగోడు: ఫలితాల వెల్లడి అనుమానాస్పదంగా ఉంది: బండి సంజయ్‌

విధాత: మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల వెల్లడిలో సీఈవో తీరుపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫలితాల వెల్లడిలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వైఖరి అనుమానాస్పదంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. టీఆర్ఎస్‌కు లీడ్ వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను అప్ డేట్ చేయడంలేదని అన్నారు.

బీజేపీ లీడ్ వచ్చినప్పటికీ వాటి ఫలితాలను వెల్లడించడం లేదని, మొదటి, రెండు రౌండ్ల తరువాత మూడు, నాలుగు రౌండ్ల ఫలితాలను అప్ డేట్ చేసేందుకు జాప్యానికి కారణాలేమిటో సీఈవో చెప్పాలని బండి సంజయ్ కుమార్ డిమాండ్‌ చేశారు.

మునుగోడు ఫలితాలు: 1631 ఓట్ల అధిక్యంలో టీఆర్‌ఎస్‌

ఎన్నికల ఫలితాల వెల్లడిలో ఎన్నడూ లేనంత ఆలస్యం ఇప్పుడే ఎందుకు జరుగుతోందని, మీడియా నుండి తీవ్రమైన ఒత్తిడి వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను ఎందుకు వెల్లడించడం లేదని బండి సంజయ్ నిలదీశారు. ఫలితాల విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఇదిలాఉండగా 4వ రౌండ్‌ కౌంటింగ్‌లో అవకతవకలు జరిగాయని తిరిగి కౌంట్‌ చేయాలని రాజగోపాల్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌కు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఫోన్

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌కు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఫోన్ చేశారు. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ఫలితాలు ఎందుకు వెల్లడించడం లేదని సీఈవోను ప్రశ్నించారు. మంత్రి ఫోన్ చేసిన 10 నిమిషాల్లోనే 4 రౌండ్ల ఫలితాలను సీఈవో వెంటనే అప్ లోడ్ చేశారు.