ఆఫ‌ర్స్‌లేక అలాంటి ప‌నులు చేస్తున్న జ‌బ‌ర్ధ‌స్త్ బ్యూటీ.. రంగంలోకి సైబ‌ర్ క్రైమ్ పోలీసులు

ఆఫ‌ర్స్‌లేక అలాంటి ప‌నులు చేస్తున్న జ‌బ‌ర్ధ‌స్త్ బ్యూటీ.. రంగంలోకి సైబ‌ర్ క్రైమ్ పోలీసులు

ఇటీవ‌ల సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియాలో విచిత్ర‌క‌ర‌మైన ప‌రిస్థితులు ఎదుర్కొంటున్నారు. సాంకేతికత అభివృద్ధి చెందాక మార్ఫ్డ్ ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేశాయి. ర‌ష్మిక‌తో పాటు ప‌లువురు భామ‌ల మార్ఫింగ్ వీడియోలు సోష‌ల్ మీడియాని షేక్ చేయ‌డం మనం చూశాం. ఇప్పుడు జ‌బ‌ర్ధ‌స్త్ బ్యూటీ రీతూ చౌద‌రి త‌న‌పై కూడా అలా చేశార‌ని, ఆ స‌మ‌యంలో న‌ర‌కం అనుభ‌వించానంటూ త‌న యూట్యూబ్ ఛానెల్‌లో చెప్పుకొచ్చింది. రీతూ చౌదరి మార్ఫింగ్ వీడియోలు, ఫోటోలు కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తుండ‌గా, ఓ ఆకతాయి అయితే ఏకంగా తనను ఇంస్టాగ్రామ్ లో ట్యాగ్ చేసి మార్ఫింగ్ వీడియో పోస్ట్ చేశాడట. ఆ స‌మ‌యంలో దానిపై స్పందించాలా, వ‌ద్దా అని రీతూ అనుకుంద‌ట‌.

నేను చాలా స్ట్రాంగ్ అయిన కూడా నాకు దెబ్బ మీద దెబ్బ ప‌డింది. నాన్న చనిపోయారు. హౌస్ ఇంటీరియర్ విషయంలో ఒక గొడవ. వాటి నుండి బయటపడేలోపు ఈ వీడియోల‌తో టార్చ‌ర్ చూపించారు. అయితే వీటి గురించి ముందు శ్రీకాంత్ కి చెప్పాను, అతడు నువ్వు కానప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సైబర్ క్రైం లో ఫిర్యాదు చేద్దాం అని చెప్పాడు.. అమ్మ కూడా అదే చెప్పింది. ఇవన్నీ పట్టించుకోకు. పోలీస్ కేసు పెడదాం అని చెప్ప‌డంతో పాటు నాకు స‌పోర్ట్‌గా నిలిచారు. ఇక కొంద‌రు ఆ స‌మ‌యంలో ఆఫర్స్ లేక ఇలాంటి పనులు చేస్తున్నావా? అని కామెంట్స్ చేశారు. తప్పుడు కామెంట్స్ చేసిన అందరి మీద ఫిర్యాదు చేశాను.

ఒకడిని పోలీసులు ప‌ట్టుకు రాగా, వాడికి ఇద్దరు అక్కలు అట. ఎందుకు చేశావ్ ఈ పని అంటే, తెలియదు తప్పై పోయింది మేడం అంటున్నాడు. వాళ్ళ బావ ఇండస్ట్రీలోనే పని చేస్తాడట.. ఈసారికి వదిలేయండి మేడం అంటూ వేడుకున్నాడ‌ని రీతూ పేర్కొంది. ఇక వీడియాలో త‌న మార్ఫ్‌డ్ వీడియోలు పోస్ట్ చేసిన వ్యక్తిని కూడా ప‌రి చేసింది. ఆరు నెల‌ల నుండి ఇది జ‌రుగుతుంద‌ని పేర్కొంది. అంతేకాదు త‌ను పోలీసుల‌కి చాలా మంది ఐడీలు ఇచ్చాన‌ని చెప్పుకురాగా, ఒక్కొక్క‌రు మెల్ల‌గా బ‌య‌ట‌కు వ‌స్తారంటూ రీతూ చౌదరి చెప్పుకొచ్చింది. రీతూ చౌదరి వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఇక రీతూకి ఇప్పుడు పెద్ద‌గా అవ‌కాశాలు లేన‌ట్టు తెలుస్తుండ‌గా, ఆమె సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తుంది.