పందిలా తింటాడంటూ స‌ల్మాన్ ఖాన్ గురించి అంత దారుణంగా మాట్లాడాడేంటి?

పందిలా తింటాడంటూ స‌ల్మాన్ ఖాన్ గురించి అంత దారుణంగా మాట్లాడాడేంటి?

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న ఆరుప‌దుల వ‌య‌స్సుకి ద‌గ్గ‌ర‌లో ఉన్నా కూడా కుర్రాడిలా క‌నిపిస్తూ అంద‌రిలా ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు. ఇక మంచి హిట్స్ కూడా అందుకుంటూ ఫ్యాన్స్‌ని ఫుల్ ఖుషీ చేస్తున్నాడు. అయితే బాలీవుడ్ కండ‌ల వీరుడిగా ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న స‌ల్మాన్ ఖాన్ గురించి ఆయ‌న ఫ్రెండ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. పందిలా తింటాడంటూ స‌ల్మాన్ ఫ్రెండ్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. స‌ల్మాన్ ఖాన్‌కి వింద్ దార సింగ్ అనే ప్రాణ స్నేహితుడు ఉన్నాడు. వారిద్ద‌రి స్నే హం కొన్నేళ్ల‌గా కొన‌సాగుతుంది. కాలేజీలో మొదలైన ప‌రిచ‌యం ఆ త‌ర్వాత స్నేహంగా మారి ఇప్ప‌టికీ కొన‌సాగుతుంది.

అయితే రీసెంట్‌గా వింద్ దార సింగ్ త‌న క్లోజ్ ఫ్రెండ్‌పై చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. స‌ల్మాన్ మంచి భోజ‌న ప్రియుడు అని చెప్పిన దార సింగ్.. మూడు పూట‌లు పుల్లుగా లాగిస్తాడ‌ని చెప్పాడు. తిండి విష‌యంలో అత‌ను ఏ మాత్రం కాంప్ర‌మైజ్ కాడు. పందిలా తింటాడు..కుక్క‌లా ఎక్స‌రసైజ్ చేస్తాడ‌ని స‌ర‌దాగా అన్నారు.తిన్నదంతా కూడా ఎక్స‌ర్‌సైజ్ చేసి చెమ‌ట రూపంలో బ‌య‌ట‌కు పంపిస్తార‌ని ఆయ‌న చెప్పారు. తిన్న‌దంతా ఎక్క‌డికి పోతుంది అంటే? ఎక్స‌ర‌సైజ్ రూపంలో పంపిస్తున్నా క‌దా అని స‌ర‌దాగా చెబుతుంటాడ‌ట‌. నిత్యం గంట‌ల త‌ర‌బ‌డి వ్యాయామం చేయ‌డం వ‌ల్ల‌నే సల్మాన్ ఖాన్ అంత ఫిట్‌గా ఉన్నాడ‌ని చెప్పాడు.

సల్లూ చాలా మంచివాడు. డబ్బు అస్స‌లు తన వద్ద ఉంచుకోడు. తండ్రి సలీం ఖాన్ ద‌గ్గ‌ర‌ ఇప్పటికీ పాకెట్ మనీ తీసుకుంటాడు. అయితే తీసుకున్న‌దంతా పేద‌వాళ్లకి పంచేస్తాడు. నెల‌కి ఆయ‌న రూ. 25 నుండి 30 లక్షల వ‌ర‌కు దాన ధర్మాలు చేస్తాడు. ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేప‌డుతుంటారు. అత‌డు మ‌హోన్న‌త‌మైన వ్య‌క్తి. అత‌ను అంటే నాకు చాలా ఇష్టం అంటూ విందు దారా సింగ్ కామెంట్ చేశారు. దార సింగ్ వ్యాఖ్య‌ల్ని బ‌ట్టి స‌ల్మాన్ ఎంత గొప్ప స్నేహితుడ‌నేది మ‌న‌కి అర్ధ‌మ‌వుతుంది. ఇక స‌ల్మాన్ ఖాన్ ఈ మ‌ధ్య స‌రైన స‌క్సెస్ అందుకున్న సంద‌ర్భాలు త‌క్కువ‌. రేసులో వెన‌క‌బ‌డ్డ అత‌ను ఒక మంచి హిట్ కోసం కృషి చేస్తున్నాడు.