రెండో పెళ్లి అంటే ఇష్టం లేదు.. ఫ్యామిలీ ఒత్తిడి వలన ఏడడుడుగులు వేసేందుకు సిద్ధమైన సమంత

అందాల ముద్దుగుమ్మ సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. చెన్నై భామ అయినప్పటికీ తెలుగుప్రేక్షకులకి చాలా దగ్గరైంది. అక్కినేని వారింట కోడలిగా కూడా అడుగుపెట్టింది. కాని నాగ చైతన్య, సమంత మధ్య వచ్చిన కొన్ని మనస్పర్ధల వలన ఇద్దరు విడాకులు తీసుకొని సింగిల్‌గా ఉంటున్నారు.అయితే వీరిద్దరు విడిపోయిన చాలా రోజులు అవుతున్నా కూడా నిత్యం వీరి విడాకులకి సంబంధించి ఏదో ఒక వార్త నెట్టింట హల్‌చల్ చేస్తూనే ఉంటుంది.తాజాగా సమంత సంచలన నిర్ణయం తీసుకోబోతుందనే సంకేతలు కనిపిస్తున్నాయి.సమంత గత కొంతకాలంగా మయసైటీస్ అనే వ్యాధితో బాధపడుతూ ఉండగా, అందుకు తగు చికిత్స కూడా తీసుకుంటుంది.
ఆరోగ్యంపై పూర్తి దృష్టి పెట్టాలని భావించిన ఈ అమ్మడు పూర్తిగా సినిమాలకు కూడా దూరమైంది. ఏడాది పాటు సినిమాలు చేయనంటూ కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. కేవలం సోషల్ మీడియాలోనే సందడి చేస్తూ తెగ అలరిస్తుంది. అయితే సమంత రెండో పెళ్లి గురించి నెట్టింట తెగ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంతని రెండో పెళ్లి చేసుకోమని ఆమె తల్లిదండ్రులు చాలా ఒత్తిడి చేస్తున్నారట. దీనికి అంగీకరించడం లేదని ప్రచారాలు సాగాయి. ఒకసారి పెళ్లి చేసుకుని మోసపోయానని..మరోసారి అలాంటి తప్పు జరగనివ్వకుండా చూసుకుంటానని సమంత తన సన్నిహితులతో కూడా చెప్పినట్టు టాక్ నడిచింది.
అయితే తాజా సమాచారం ప్రకారం సమంత తన తల్లిదండ్రుల ఒత్తిడి తట్టుకోలేక రెండో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈసారి సినీ ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తిని సమంత పెళ్లాడనుందని, అతను మరెవరో కాదని, తమ ఫ్యామిలీ రిలేషన్‌కు సంబంధించిన వ్యక్తి అని సమాచారం. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాల్సి ఉంది. గతంలో కూడా సమంత రెండో పెళ్లికి సంబంధించి ఇలాంటి వార్తలు చాలా రాగా అవి పుకార్లుగానే మిగిలిపోయాయి. మరి ఇది అయిన నిజం అవుతుందా లేకుంటే పుకారుగానే మిగిలిపోతుందా అనేది చూడాలి.