నాగ చైత‌న్య‌కి సారీ చెప్పిన స‌మంత‌.. మ‌ళ్లీ ఇద్ద‌రు ఒక్క‌ట‌వుతారా ఏంటి?

నాగ చైత‌న్య‌కి సారీ చెప్పిన స‌మంత‌.. మ‌ళ్లీ ఇద్ద‌రు ఒక్క‌ట‌వుతారా ఏంటి?

స‌మంత నాగ చైత‌న్య జంట టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్‌గా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. వారిని చూసిన వారు ఎవ‌రైన జంట చూడ ముచ్చ‌ట‌గా ఉంద‌ని కామెంట్ చేసేవారు. కాని ఏం జ‌రిగిందో ఏమో కాని ఇద్ద‌రు కూడా విడాకులు తీసుకొని అంద‌రికి పెద్ద షాక్ ఇచ్చారు. వారు విడిపోవ‌డానికి కార‌ణం ఏంట‌నే దానిపై ఇప్ప‌టికీ క్లారిటీ లేదు. కాని నెట్టింట మాత్రం అనేక వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉంటాయి. వాటిపై స‌మంత కాని, నాగ చైత‌న్య కాని ఏ మాత్రం స్పందించ‌రు. అయితే చైతూ నుండి విడిపోయిన త‌ర్వాత స‌మంత మయోసైటిస్ వ్యాధి బారిన ప‌డిన విష‌యం తెలిసిందే.

కొంత కాలంగా ఆ వ్యాధితో బాధపడుతున్న సమంత చికిత్స కోసం కొంతకాలం సినిమాలకు కూడా విరామం ప్రకటించి ఆరోగ్యంపై పూర్తిగా దృష్టి పెట్టింది. అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తూ లేదంటే ఇంట‌ర్వ్యూల ద్వారా అనేక విష‌యాలు షేర్ చేసుకుంటూ హాట్ టాపిక్ అవుతుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స‌మంత మాట్లాడుతూ ఫ్యామిలీమెన్ వెబ్ సిరీస్ వల్ల ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చింది. తన హోమ్ ను రాజీ పాత్ర పాడు చేసిందని, ఆ వెబ్ సిరీస్ లో తన పాత్రవల్ల ఎవరైనా బాధపడితే క్షమించాలంటూ స‌మంత కోరింది. ఈ సిరీస్ లో సామ్ తన పాత్రకు వందశాతం న్యాయం చేసినప్పటికీ ఆమె మాత్రం చాలా విమ‌ర్శ‌లు ఎదుర్కొంది.

చైతూ, స‌మంత మ‌ధ్య దీని వ‌ల్ల‌నే గొడ‌వ జ‌రిగి విడాకుల వ‌ర‌కు వెళ్లార‌ని టాక్ కూడా న‌డిచింది. అయితే ఇప్పుడు స‌మంత క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డంతో చైతన్యతో కలిసిపోవాలనే నిర్ణయానికి వచ్చిందని కొంద‌రు చెప్పుకొస్తున్నారు. ఇద్ద‌రు కూడా చిన్న చిన్న మనస్పర్థలవల్లే విడిపోయారని, మళ్లీ కలిసిపోతే అంత క‌న్నా గుడ్ న్యూస్ మ‌రొక‌టి ఉండ‌దంటూ ప‌లువురు వ్యాఖ్యానించుకుంటున్నారు. చూడాలి మ‌రి రానున్న రోజుల‌లో చైతూ, సామ్ క‌లిసి ఏదైన స‌ర్‌ప్రైజ్ ఇస్తారా అని. ఇక విడిపోయిన‌ప్ప‌టి నుండి స‌మంత‌, నాగ చైత‌న్య క‌లిసి సినిమా చేసింది లేదు. ఏ ఈవెంట్‌లోను ఎదురు ప‌డింది కూడా లేదు. వారిద్ద‌రు క‌లిస్తే చూడాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటున్నారు.