కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి.. పవన్ కళ్యాణ్ బ్యూటీ హింట్ ఇచ్చేసిందిగా..!

గత ఏడాది చాలా మంది సెలబ్రిటీలు సైలెంట్‌గా పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది కూడా కొందరు పెళ్లికి రెడీగా ఉన్నారు. కొన్నాళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న వారు ఎప్పుడు బాంబ్ పేల్చుతారో గెస్ చేయడం కూడా కష్టంగా మారింది. అయితే ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ పెళ్లి త్వరలోనే జరగనుందంటూ ఓ వార్త నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ఎంట్రీ ఇచ్చి విరూపాక్షలో అదరగొట్టిన నటి సంయుక్త మీనన్ గోల్డెన్ బ్యూటీగా మారింది. భీమ్లా నాయక్` ,బింబిసార ,సార్ ,విరూపాక్ష ఇలా ఇటీవలి కాలంలో వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది.
సంయుక్త మీనన్ 2016 లో ‘పాప్ కార్న్’ అనే మళయాళ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. ఇక అక్కడ నుండి తమిళ, కన్నడ, తెలుగు సినిమాల్లో నటించారు. 2018 లో ‘కలరి’ అనే సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా, తెలుగులో మొదటగా హీరో కళ్యాణ్ రామ్ సినిమా బింబిసారలో నటించినప్పటికీ, విడుదలైంది మాత్రం భీమ్లా నాయక్. ఇక 2023లో విరూపాక్ష చిత్రంలో నటించి నందిని అనే నెగెటివ్ పాత్రతో అదరగొట్టింది.వరుస హిట్స్ దక్కించుకున్న సంయుక్త మీనన్ ఈ మధ్య ఎందుకో సినిమాలపై పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు.ఇదే సమయంలో సంయుక్త త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి.
2024లో సంయుక్త మీనన్ పెళ్లి పీటలెక్కబోతుందని ప్రచారం జరుగుతుంది. అయితే సంయుక్త మీనన్ అందుకు సంబంధించిన హింట్ కూడా ఇస్తుంది. వరుస హిట్స్ కొట్టిన సంయుక్త మీనన్ ఇటీవల కాలంలో ఆమె కొత్తగా మరే సినిమాకి సైన్ చేయలేదు. ఏ మూవీని కూడా ప్రకటించలేదు. తెలుగులోనే కాదు, ఇతర భాషల్లోనూ సంయుక్త మీనన్ సినిమాల వైపు దృష్టి పెట్టడం లేదు. దీనిని పట్టుకొని ఆమె ఈ ఏడాది పెళ్లి చేసుకోవడం ఖాయమని కొందరు చెప్పుకొస్తున్నారు. మరి దీనిపై సంయుక్త ఏదైన స్పందిస్తుందా అనేది చూడాలి.