తండ్రి పాట‌కి సితార దుమ్ము రేపే డ్యాన్స్.. ఈ డ్యాన్స్ చూసి ఎవ‌రైన ఫిదా కావ‌ల్సిందే..!

తండ్రి పాట‌కి సితార దుమ్ము రేపే డ్యాన్స్.. ఈ డ్యాన్స్ చూసి ఎవ‌రైన ఫిదా కావ‌ల్సిందే..!

మ‌హేష్ బాబు గారాల ప‌ట్టిగా సితార అంద‌రికి సుప‌రిచితం అయిన ఇప్పుడు త‌న టాలెంట్‌తో క్రేజ్ ని అమాంతం పెంచుకుంటూ పోతుంది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తెగ సంద‌డి చేస్తుంది. ఇంకా సినిమాల్లోకి రాక‌పోయిన అంత‌కు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది సితార‌.ఈ చిన్నారి ఎప్ప‌టిక‌ప్పుడు త‌న తండ్రి సినిమాల‌లోని పాట‌ల‌కి స్టెప్పులు వేస్తూ అద‌ర‌గొడుతూ ఉంటుంది. ఆ మ‌ధ్య `సర్కారు వారి పాట`లో `పెన్నీ` సాంగ్‌లో మెరిసింది. ప్రమోషనల్‌ సాంగ్ లో డాన్స్ చేసి అదరగొట్టింది. చాలా కాలంగా సితార డాన్సు నేర్చుకుంటుంది. క్లాసికల్‌, వెస్ట్రన్ ఇలా అన్ని మిక్స్ చేసి కొడుతుంది. సోషల్‌ మీడియాలో దుమ్మురేపుతుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు త‌న తండ్రి సినిమాల‌లోని పాట‌ల‌కి దుమ్ము రేపుతున్న సితార తాజాగా `గుంటూరు కారం` సినిమాలోని `దమ్‌ మసాలా` పాటకి ఆమె దుమ్మురేపే డాన్సు చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ అవుతుంది. ఇందులో సితార డాన్సుకి అంతా ఫిదా అవుతున్నారు. చిత్రంలో శ్రీలీల త‌న డ్యాన్స్‌తో ఎంత అద‌ర‌గొట్టిందో మ‌నం చూశాం. ఇప్పుడు ఆమెని మించి పోయి సితార డ్యాన్స్ చేసింద‌ని అంటున్నారు. సితార హీరోయిన్ అయితే ఇప్పుడు ఉన్న హీరోయిన్స్ అంతా దిగ‌దుడుపు కావ‌ల్సిందే అని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. చూస్తుంటే రానున్న రోజుల‌లో సితార మంచి స్టార్ హీరోయిన్ అవుతుంద‌ని కొంద‌రు జోస్యం చెబుతున్నారు.

`గుంటూరు కారం` ప్రీ రిలీజ్‌ ఈవెంట్లో.. శ్రీలీలతో డాన్సులు అంటే హీరోలకు తాట ఊడిపోతుందని షాకింగ్ కామెంట్స్ చేసిన విష‌యం తెలిసిందే. ఇక సితార హీరోయిన్ అయితే సరిగ్గా ఆయన చెప్పిన డైలాగే ఆయన కూతురుకి కూడా వర్తిస్తుందని కొంద‌రు చెప్పుకొస్తున్నారు. మొత్తంగా సితార పాప ఇప్పుడు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తూ..దుమ్మురేపే డాన్సుతో కాక రేపుతుంది. ఇన్‌స్టాలో సితార‌కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె చిన్న‌ప్పుడే ల‌క్ష‌లు సంపాదిస్తున్నారు.సోష‌ల్ స‌ర్వీస్ ద్వారా కూడా సితార మంచి మ‌న‌సు చాటుకుంటుంది. సితార ఎప్పుడు సినిమాల‌లోకి వ‌స్తుందా అని ప్ర‌తి ఒక్క‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.