Sonu Gowda | బిగ్‌బాస్‌ బ్యూటీ సోనుగౌడకు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ..!

Sonu Gowda | బిగ్‌బాస్‌ బ్యూటీ సోనుగౌడకు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ..!

Sonu Gowda | కన్నడ బిగ్‌బాస్‌ బ్యూటీ సోనుగౌడ్‌కు కోర్టు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. పిల్లల దత్త కేసులో సోనుగౌడ్‌ కర్ణాటక పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గతవారం ఓ పాపను అక్రమంగా దత్తత తీసుకున్నారనే ఆరోపణలు మేరకు అరెస్టు చేశారు. అయితే, తాను ఎలాంటి తప్పు చేయలేదని.. తనకు తెలిసిన వరకు దత్తత పనులకు సంబంధించిన రూల్స్‌ పాటించినట్లు పేర్కొంది. వివరాల్లోకి వెళితే.. సోను గౌడ్‌ 45 రోజుల కిందట ఓ బాలికను అర్ధరాత్రి సమయంలో తల్లిదండ్రులతో మాట్లాడుకొని దత్తతగా తీసుకువచ్చింది. దత్తతకు సంబంధించి యూట్యూబ్‌ ఛానెల్‌లో వీడియోను పోస్ట్‌ చేసింది. ఆ తర్వాత పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా దత్తత తీసుకున్నారనే ఆరోపణలతో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

కేసుకోర్టుకు హాజరైన సోను గౌడను ఐదు రోజుల పోలీస్ కస్టడీకి ఆదేశించింది. విచారణ పూర్తికానందున మరింత సమయం కావాలని కోరడంతో మరో 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. చిన్నారిని దత్తత తీసుకున్న సమయంలో వారి తల్లిదండ్రులకు ఖరీదైన బహుమతి ఇచ్చినట్లు.. పాపతో రీల్స్‌ చేయించి పబ్లిసిటీ పొందినట్లు నటి తెలిపినట్లు సమాచారం. దత్తత తీసుకున్న తర్వాత నిబంధనలు పాటించలేదని పేర్కొంది. అక్రమంగా బిడ్డను దత్తత తీసుకున్నారనే అభియోగాలపై పోలీసులు నటిని అదుపులోకి తీసుకొని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హిందూ దత్తత చట్ట ప్రకారం.. సోనుగౌడ్ పాపను దత్తత తీసుకోలేదని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలో కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. దత్తత విషయంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు ఏడాది వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.