రైళ్లలో డయాబెటిక్ ప్రయాణికులకు ప్రత్యేక ఆహారం
విధాత: భారతీయ రైల్వేబోర్డు కీలక నిర్ణయం తీసుకున్నది. డయాబెటిక్, ఇతర వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఆహార పదార్థాలను ఎంపిక చేసుకునే అవకాశం ప్రయాణికులకే కల్పించాలని irctc సూచించింది. ఇక నుంచి రైళ్లలో క్యాటరింగ్ ఫుడ్‌తో పాటు సీజనల్ ఫుడ్‌ను అందుబాటులోకి తీసుకురానున్నది. భారతీయులు పండుగ సమయాల్లో్ తినే ప్రత్యేక రుచులను కూడా ఆయా సీజన్‌లలో అందించాలని నిర్ణయించింది చిన్నపిల్లలు తినేందుకు సాబుదాన.. ఇంకా పాలు వంటివి అందించనున్నది. వృద్ధులకు పౌష్టికాహారాన్నిirctc మెనూలో […]

విధాత: భారతీయ రైల్వేబోర్డు కీలక నిర్ణయం తీసుకున్నది. డయాబెటిక్, ఇతర వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఆహార పదార్థాలను ఎంపిక చేసుకునే అవకాశం ప్రయాణికులకే కల్పించాలని irctc సూచించింది.
ఇక నుంచి రైళ్లలో క్యాటరింగ్ ఫుడ్‌తో పాటు సీజనల్ ఫుడ్‌ను అందుబాటులోకి తీసుకురానున్నది. భారతీయులు పండుగ సమయాల్లో్ తినే ప్రత్యేక రుచులను కూడా ఆయా సీజన్‌లలో అందించాలని నిర్ణయించింది చిన్నపిల్లలు తినేందుకు సాబుదాన.. ఇంకా పాలు వంటివి అందించనున్నది.
వృద్ధులకు పౌష్టికాహారాన్నిirctc మెనూలో పెట్టనున్నది. డయాబెటిక్, ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పోషకాలు అందించడానికి క్యాటిరింగ్ మెనూ అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది.