కోట్లు సంపాదిస్తున్న శృతి హాస‌న్.. త‌న త‌ల్లిని అలా ధీనస్థితిలో వ‌దిలేసిందా?

కోట్లు సంపాదిస్తున్న శృతి హాస‌న్.. త‌న త‌ల్లిని అలా ధీనస్థితిలో వ‌దిలేసిందా?

క‌మ‌ల్ గారాల ప‌ట్టి శృతి హాస‌న్ తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా సుప‌రిచితం. గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రంతో లైమ్ లైట్‌లోకి వ‌చ్చిన ఈ అందాల భామ ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతుంది.త్వ‌ర‌లో స‌లార్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే శృతి ఇటీవ‌లి కాలంలో సినిమాల క‌న్నా కూడా ప్రేమాయ‌ణంతో ఎక్కువ వార్త‌ల‌లో నిలుస్తుంది. శాంత‌ను హ‌జారికాతో క‌లిసి ప్రేమాయ‌ణం న‌డిపిస్తున్న ఈ అందాల భామ అత‌నితో రొమాంటిక్‌గా పిక్స్ దిగుతూ వాటిని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంది. అయితే తాజాగా క‌మ‌ల్ హాస‌న్ కూతురు శృతి హాస‌న్ గురించి ఓ వార్త సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. సొంత త‌ల్లిని కూడా ప‌ట్టించుకోలేదంటూ ప్ర‌చారాలు జ‌ర‌గుతున్నాయి.

కమలహాసన్ తనతో పాటు సినిమాల్లో నటించిన హీరోయిన్ సారికని ప్రేమించి పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. వారి వైవాహిక జీవితంలో శృతిహాసన్, అక్షర హాసన్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.అయితే క‌మ‌ల్, సారిక‌ దాంపత్య జీవితం సక్రమంగా సాగినప్పటికీ కొన్నేళ్ల త‌ర్వాత ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు రావ‌డంతో విడిపోయారు. అయితే క‌మ‌ల్ నుండి విడిపోయిన త‌ర్వాత సారిక కొన్నాళ్ల పాటు కూతుళ్ల‌తో క‌లిసి ఉన్నా ఇప్పుడు మాత్రం ఒంట‌రిగా ఉంటుంద‌ట‌. ఈ మధ్య సారిక‌ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కమలహాసన్ గానీ, శృతిహాసన్ ఎవ‌రు కూడా త‌న‌ని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆవేద‌న‌ని వ్య‌క్తం చేసింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్, ఆయన మాజీ భర్త పెద్ద స్టార్, కూతుళ్లు కూడా ఇండ‌స్ట్రీలో మంచి పేరున్న స్టార్స్. అయిన‌ప్ప‌టికీ సారికకి ఇలాంటి ప‌రిస్థితి రావ‌డం దారుణ‌మ‌ని అంటున్నారు.

శృతిహాసన్ ఇటీవ‌ల తనను దూరంగా పెట్టిందని,తన దగ్గరికి ఎక్కువగా రావట్లేదని, స‌రిగ్గా మాట్లాడ‌డం లేద‌ని సారిక పేర్కొంది. ఈ క్ర‌మంలోనే లాక్ డౌన్ సమయంలో సారికకి తినడానికి తిండి లేక, చేతిలో ఒక్క రూపాయి లేకుండా ఉన్న‌ట్టు తెలియ‌జేసింది. అయితే ఆ స‌మ‌యంలో శృతిహాసన్ కి, కమలహాసన్ కి ఫోన్ చేసిన కూడా వాళ్ళు ఒక రూపాయి కూడా సహాయం చేయలేదంటూ త‌న భాద‌ని వ్య‌క్త‌ప‌ర‌చింది సారిక‌. ఇప్పటికీ త‌న స్వ‌శ‌క్తితో తాను బ‌తుకుతున్న‌ట్టు సారిక చెప్పుకొచ్చింది. ముంబైలో ఉంటూ రూమ్ రెంట్ కట్టుకుంటూ సింగిల్‌గా త‌న జీవితం గ‌డుపుతున్న‌ట్టు తెలియ‌జేసింది. ఆమెకి ఈ పరిస్థితి రావ‌డం ప‌ట్ల అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.