టాలీవుడ్‌లో మరో బిగ్గెస్ట్ క్లాష్..లాగ్ వీకెండ్ కావడంతో సమరానికి సిద్ధమవుతున్న స్టార్ హీరోలు

ఈ ఏడాది సంక్రాంతికి ఏకంగా నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా, ఇందులో హనుమాన్, నా సామిరంగ చిత్రాలు మాత్రమే మంచి విజయం సాధించాయి. సైంధవ్, గుంటూరు కారం ప్రేక్షకులని అంతగా అలరించలేకపోయాయి. ఈ బిగ్గెస్ట్ వార్‌లో హనుమాన్ మాత్రమే ఎక్కువ వసూళ్లు రాబట్టింది. ఇక ఆగస్ట్‌లో మరోసారి బిగ్గెస్ట్ క్లాష్ జరగనున్నట్టు తెలుస్తుంది. ఆగస్ట్ 15కి పుష్పరాజ్ వస్తున్నాడంటూ గతంలో మేకర్స్ చెప్పగా, ఆ టైంకి రావడం కష్టమే అని అందరు అనుకున్నారు. కాని చెప్పిన టైమ్ కే వచ్చేస్తాను అంటూ పుష్పరాజ్ ఇటీవల క్లారిటీ ఇచ్చాడు. మరోవైపు అదే రోజు దేవర సినిమా కూడా విడుదల కాబోతోంది అంటూ ఓ టాక్ గట్టిగా వినిపిస్తుంది.
ఈ రెండు చిత్రాలతో పాటు సరిపోదా శనివారం సినిమా కూడా రానున్నట్టు తెలుస్తుంది. మరి ఆ డేట్‌ని ఇలా మూడు సినిమాలు టార్గెట్ చేస్తున్నాయని తెలుస్తుండగా, పోటీ మాత్రం పీక్స్‌లో ఉంటుందని అర్ధమవుతుంది. అయితే ఈ డేట్‌ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే.. ఆగస్టు 15 పబ్లిక్ హాలిడే. తర్వాతి రోజు అయిన ఆగస్టు 16న వరలక్ష్మీ వ్రతం ఉంది. ఆరోజు కూడా హాలిడేనే అని చెప్పాలి. ఇంక తర్వాత ఆగస్టు 17 శనివారం, 18 ఆదివారం. ఆగస్టు 19న రక్షా బంధన్ ఉంది. ఇలా వరుస సెలవులు ఉన్నాయి. ఇక నార్త్‌లో ఆగస్టు 22న సంకష్టి చతుర్థి, కజారి తీజ్ ఉన్నాయి. అంటే వారికి ఆ రోజుల్లో సెలవులు. ఇప్పుడు మన హీరోల సినిమాలు దేశ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఇలా సెలవులని టార్గెట్ చేసి ఎన్టీఆర్, బన్నీ బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తుంది.
ఆగస్టు 24 శనివారం, 25 ఆదివారం, ఆగస్టు 26న జన్మాష్టమి కావడంతో కూడా సెలవులు ఉంటాయి . ఇలా మొత్తం మీద ఆగస్టు 15 నుంచి ఆగస్టు నెలాఖరు వరకు అడపాదడపా సెలవలు వస్తున్న నేపథ్యంలో ఆగస్ట్ 15ని స్టార్ హీరోలు టార్గెట్ చేసినట్టు అర్ధమవుతుంది. ప్రస్తుతానికి పుష్పరాజ్, దేవర పోటీ పడబోతున్నారని తెలుస్తుండగా, రానున్న రోజులలో ఈ ఫైట్‌లో ఇంకెంత మంది చేరతారో చూడాల్సి ఉంది.