మొద‌టి భ‌ర్త‌తో చాలా ఇబ్బందులు ప‌డ్డ సునీత‌.. రెండో భ‌ర్త‌తో లైఫ్ ఎలా ఉందో చెప్పిన స్టార్ సింగ‌ర్

మొద‌టి భ‌ర్త‌తో చాలా ఇబ్బందులు ప‌డ్డ సునీత‌.. రెండో భ‌ర్త‌తో లైఫ్ ఎలా ఉందో చెప్పిన స్టార్ సింగ‌ర్

సింగ‌ర్‌గా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా, యాంక‌ర్‌గా తెలుగు ప్రేక్ష‌కులకి ద‌గ్గ‌ర‌య‌య్యారు సునీత‌. త‌ను పాట పాడితే కోయిల కూసిన‌ట్టుగా ఉంటుంద‌ని చాలా మంది చెప్పుకొచ్చారు. సునీత ఇప్ప‌టికీ త‌న పాట‌ల‌తో అల‌రిస్తూనే ఉంది. అయితే కెరీర్ బాగానే సాగిన ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో మాత్రం చాలా స్ట్ర‌గుల్స్ ఫేస్ చేసింది సునీత‌. ఇక 42 ఏళ్ల వయసులో సునీత మళ్ళీ పెళ్లి చేసుకోవడం సంచలనంగా మారింది. పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లలు ఉండగా… ఈ వయసులో వివాహం ఏంటంటూ సునీత‌ని చాలా మంది దారుణ‌మైన విమ‌ర్శ‌లు చేశారు.అయితే దానిపై హుందాగా స్పందించిన సునీత‌.. ఇది పిల్లల భవిష్యత్ కోసం తీసుకున్న నిర్ణయం అని అంగీకరించి మద్దతు తెలపాలని స్ప‌ష్టం చేశారు.

అయితే రామ్ ని వివాహం చేసుకుని మూడేళ్లు అవుతుండగా సునీత సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రామ్ తాళికడుతున్న ఫోటో షేర్ చేస్తూ.. ఈ క్షణం నా జీవితంగా సంతోషమయంగా మార్చేసిందని, ఆమె త‌న కామెంట్‌లో తెలియ‌జేశారు. 2021 జనవరి 9న రామ్ వీరపనేని-సునీతల వివాహం ఘనంగా జర‌గ‌గా, ఈ వేడుక‌కి హీరో నితిన్ తో పాటు మరికొందరు చిత్ర ప్రముఖులు హాజరయ్యారు. కొడుకు ఆకాష్, కూతురు శ్రియ దగ్గరుండి తల్లి పెళ్లి చేయ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. అప్ప‌ట్లో సునీత రెండో పెళ్లికి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా ఉండేది.

సునీత మొదటి భర్త కిరణ్ గోపరాజు వ‌ల‌న ఆమె చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. అనేక ఆర్థిక ఇబ్బందులు, ఒడిదుడుకులు వ‌ల‌న అత‌ని నుండి విడిపోయిన సునీత సోలోగానే చాన్నాళ్ల‌పాటు ఉంది. ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులతో ఒంటరిగా చాలా కాలం నుండి ఒంటరిగా జీవిస్తున్న సునీత‌కి రామ్ నుండి మ్యారేజ్ ప్రపోజల్ రావ‌డం, ఆమె త‌న కుటుంబ స‌భ్యుల‌తో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోవ‌డం వెంట‌వెంట‌నే జ‌రిగిపోయాయి. రామ్ కోట్లకు అధిపతి కాగా, ఇప్పుడు ఆయ‌న పిల్లల భవిష్యత్ బాధ్యత కూడా తీసుకున్నాడు. ఇటీవల సునీత కొడుకు ఆకాష్ హీరోగా ఎంట్రీ ఇవ్వడం వెనుక రామ్ సపోర్ట్ ఉంది. ప్ర‌స్తుతం సునీత జీవితం చాలా సంతోషంగా సాగుతుంది.