ముంబయితో జరుగుతున్న ఐపిఎల్ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. సిక్సర్లు, బౌండరీల వర్షంతో ఉప్పల్ స్టేడియం తడిసిముద్దయింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగుల రికార్డు స్కోరును నమోదు చేసింది. దీన్ని చేధించే క్రమంలో ముంబయి కూడా ధీటుగా బదులిచ్చింది. కానీ లక్ష్యం మరీ పెద్దదవడం, ఒత్తిడి కూడా తోడవడంతో 20 ఓవర్లలో 215 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఒక ఐపిఎల్ మ్యాచ్‌లో 500 పరుగులకు పైగా స్కోరవడం ఇదే మొదటిసారి.
హైదరాబాద్‌లో జరుగుతున్న ఐపిఎల్2024 మ్యాచ్‌లో సన్రైజర్స్జట్టు ముంబయిపై 31 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. హైదరాబాద్ జట్టు విధించిన 278 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ముంబయి 5 వికెట్ల నష్టానికి 246 పరుగులకు చేసింది. ఈ సీజన్లో హైదరాబాద్ తన మొదటి విజయాన్ని కనీవినీఎరుగని రీతిలో సాధించింది. ఈ టీమ్ స్కోరు ఐపిఎల్ చరిత్రలోనే హైయెస్ట్ టోటల్. అంతకుముందు 2013లో బెంగళూరు జట్టు పుణె వారియర్స్‌పై 263 పరుగులు చేసింది. ఇప్పటివరకు అదే టోర్నీ చరిత్రలో అత్యధిక స్కోర్. ఓపెనర్ ట్రావిస్ హెడ్ 24 బంతుల్లో 62 (4–9, 6–3)పరుగులు చేయగా, వన్‌డౌన్‌లో వచ్చిన అభిషేక్ శర్మ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. 23 బంతుల్లో 63(4–3, 6–7) పరుగులు చేసిన శర్మ చావ్లా బౌలింగ్‌లో నమన్‌కు దొరికి అవుటయ్యాడు. వీరి ధాటికి 10 ఓవర్లలో హైదరాబాద్ 148 పరుగులు చేసింది. 15 ఓవర్లలోనే 202 రన్స్ చేసి రికార్డు సృష్టించింది. తరువాత కూడా విధ్వంసం అలాగే కొనసాగింది. హెన్రిచ్ క్లాసెన్(34 బంతుల్లో 80 పరుగులు), మార్క్రమ్(28 బంతుల్లో 42 పరుగులు) చేసి నాటౌట్‌గా నిలిచారు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 19 ఫోర్లు, 18 సిక్సర్లు నమోదయ్యాయి. సన్‌రైజర్స్ తరపున మొదటి ఫాస్టెస్ట్ ఫిఫ్టీ(అభిషేక్ శర్మ–16 బంతులు), రెండో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ (ట్రావిస్ హెడ్ – 18 బంతులు) ఈ మ్యాచ్‌లోనే నమోదయ్యాయి.ముంబయి జట్టులో కెప్టెన్ పాండ్యా, కొయిట్జీ, పియూష్ తలా ఒకో వికెట్ తీసుకున్నారు.
ఆ తరువాత బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ధాటిగా దాడి ప్రారంభించింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (34), రోహిత్ శర్మ (26) తరువాత వచ్చిన తెలుగు కుర్రాడు తిలక్‌వర్మ చెలరేగి ఆడాడు. తను 34 బంతుల్లో 64 పరుగులు చేసి అవుటయ్యాడు. కొత్త ఆటగాడు నమన్ ధీర్ 30 పరుగులు, కెప్టెన్ హార్థిక్‌పాండ్యా 24 పరుగులు చేసారు. చివరికి టిమ్ డేవిడ్ 42 పరుగులతో, షెప్పర్డ్ 15 పరుగులతో నాటౌట్‌గా మిగిలారు. హైదరాబాద్ జట్టులో కెప్టెన్ కమ్మిన్స్, జయదేవ్ ఉనద్కత్ చెరో రెండు వికెట్లు తీయగా, షాబాజ్ అహ్మద్ ఒక వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదవడం విశేషం.