ర‌కుల్ పెళ్లి ముగిసింది.. ఇక మ‌రో హీరోయిన్ పెళ్లి పీట‌లెక్కేందుకు సిద్ధం..!

ర‌కుల్ పెళ్లి ముగిసింది.. ఇక మ‌రో హీరోయిన్ పెళ్లి పీట‌లెక్కేందుకు సిద్ధం..!

ఒక‌ప్పుడు త‌మ అంద‌చందాల‌తో ప్రేక్ష‌కుల‌ని ఉర్రూత‌లూగించిన అందాల భామ‌లు ఇప్పుడు ఒక్కొక్కరుగా పెళ్లి పీట‌లెక్కుతున్నారు.ప్రేమించిన వ్య‌క్తిని పెళ్లి చేసుకొని నిండు నూరేళ్లు సంతోషంగా ఉండేందుకు ప్ర‌ణాళిక‌లు వేసుకుంటున్నారు. రీసెంట్‌గా పంజాబీ ముద్దుగుమ్మ ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. బాలీవుడ్ నిర్మాత జాకీ భ‌గ్నానిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.వీరిద్ద‌రి పెళ్లి గోవాలో అట్ట‌హాసంగా కేవ‌లం కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితుల మ‌ధ్య జ‌రిగింది. వారి వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోల‌ని ర‌కుల్ దంప‌తులు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుండ‌గా, అవి వైర‌ల్ అవుతున్నాయి. ఇక మరికొన్ని రోజుల్లో మరో హీరోయిన్ తాప్సీ కూడా ఏడడుగులు వేయడానికి రెడీ అయిన‌ట్టు టాక్ వినిపిస్తుంది.

గ‌త కొంత కాలంగా తాప్సీ డెన్మార్క్ బ్యాడ్మింటన్ కోచ్ ‘మథియాస్ బోయ్‌’తో ప్రేమలో ఉన్నారు. ఇన్నాళ్లు లవ్ జర్నీ చేసిన వీరిద్దరూ.. మార్చి నెలలో పెళ్లి పీట‌లెక్కేందుకు సిద్ధ‌మ‌య్యార‌ట‌. వీరిద్ద‌రి పెళ్లి ఉదయపూర్ లోజ‌ర‌గ‌నుంద‌ని టాక్. సిక్కు, క్రిస్టియన్ సంస్కృతిలో వివాహం వీరి వివాహం జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తుండ‌గా, వీరి వివాహానికి సెల‌బ్రిటీలు ఎవ‌రు హాజరు కావ‌డం లేద‌ని టాక్. కేవలం స‌న్నిహితులు, శ్రేయోభిలాషులు మాత్రమే తాప్సీ పెళ్లిలో సంద‌డి చేయ‌నున్నార‌ని తెలుస్తుంది. అయితే గ‌త రెండు రోజులుగా ఈ వార్త‌లు నెట్టింట వైర‌ల్ అవుతుండ‌గా, దీనిపై తాప్సీ స్పందించింది. ‘మార్చి నెలాఖరులో మీ వివాహం జరగబోతుందనే వార్తలో ఎంత నిజముందని తాప్సీని ప్ర‌శ్నించ‌గా దానికి ఆమె ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చింది.

నేను ఎప్పుడు కూడా “నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు పై అస్సలు క్లారిటీ ఇవ్వ‌లేదు. ఇప్పుడు కూడా క్లారిటీ ఇవ్వ‌ను. ఎప్పుడు ఇవ్వను అంటూ తాప్సీ చెప్పుకొచ్చింది. ఆమె కామెంట్స్‌తో తాప్సీ పెళ్లిపై మ‌రోసారి సందేహం నెల‌కొంది. ఇక ఈ అమ్మ‌డి కెరియ‌ర్ విష‌యానికి వ‌స్తే తాప్సీ తెలుగుతో పాటు హిందీలో ప‌లు చిత్రాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంది. ఇటీవల షారూఖ్‌తో `డంకీ`చిత్రంలో మెరిసింది షారూఖ్‌, తాప్సీ క‌లిసి ఈ చిత్రంతో మంచి వినోదం పంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు `వాహ్‌ లడ్కీ హై కహాన్‌`, `ఫిర్‌ ఆయి హసీన్‌ దిల్‌రూబా`, `ఖేల్‌ ఖేల్‌ మెయిన్‌` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ చిత్రాల‌తో తాప్సీ మ‌రిన్ని హిట్స్ త‌న ఖాతాలో వేసుకోవ‌డం ఖాయం అని అంటున్నారు.